ఇతడో ట్రెండ్ సెట్టర్, 21 సంవత్సరాలకే కోట్లు సంపాదిస్తున్నాడు!

మనలో ప్రతి ఒక్కరికి లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అనేక అవాంతరాలు, ఆటు పోట్లు మనకు ఎదురువుతుంటాయి.

|

మనలో ప్రతి ఒక్కరికి లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అనేక అవాంతరాలు, ఆటు పోట్లు మనకు ఎదురువుతుంటాయి. వీటికి బెదిరిపోకుండా సమర్థవంతంగా ఎదుర్కున్ననాడే మన కలలను మనం సాకారం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతోన్న సక్సెస్ స్టోరీలోని హీరో పేరు టీఎన్‌ఎమ్ జవాద్ (TNM Jawad). వయస్సు 21 సంవత్సరాలు.

మార్కెట్లో ఉన్న బెస్ట్ ,వరస్ట్ ప్లాన్ల గురించి తెలుసుకోండిమార్కెట్లో ఉన్న బెస్ట్ ,వరస్ట్ ప్లాన్ల గురించి తెలుసుకోండి

ఇష్టమైన పనినే కెరీర్‌గా మలచుకుని..

ఇష్టమైన పనినే కెరీర్‌గా మలచుకుని..

పేదరికంలో తన బతుకు పోరాటాన్ని మొదలుపెట్టిన ఈ కుర్రోడు తనకు ఇష్టమైన పనినే కెరీర్‌గా మలచుకుని తానేంటో నిరూపించుకున్నాడు. తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన కంప్యూటర్‌తో వెబ్ డిజైనింగ్‌తో ఓనమాలు నేర్చుకున్న జవాద్ అంచెలంచెలుగా పైకెదిగి నేటి యువతకు స్పూర్తిప్రధాతగా నిలిచాడు. TNM Online Solutions పేరుతో ఓ మల్టీ కోర్ ఐటీ సంస్థను ప్రారంభించిన జవాద్ పలువురికి ఉపాధి కల్పించటంతో పాటు ఏడాదికి రెండు కోట్లు అర్జిస్తున్నాడు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది క్లయింట్స్ ఉన్నారు. సున్నా నుంచి ప్రారంభమైన ఈ యువ వ్యాపారవేత్త ప్రస్థానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుటుంబ నేపథ్యం..

కుటుంబ నేపథ్యం..

మహ్మద్ జవాద్ టీఎన్ కేరళలోని కన్నూర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి ఓ మళయాళీ వార్తాపత్రికలో సంపాదకీయుడిగాపనిచేసేవారు. మహ్మద్ తన చిన్నతనం నుంచే తండ్రి కార్యాలయానికి వెళ్తూ తండ్రి వాడే కంప్యూటర్ ముందు కూర్చునే వాడు. ఖాళీగా కూర్చోకుండా కంప్యూటర్లో ఎప్పుడు ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉండేవాడు. జవాద్ ఆసక్తిని తండ్రి ఎప్పుడుకప్పుడుగమనిస్తూనే ఉండేవాడు.

వాద్‌‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసేవి..

వాద్‌‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసేవి..

జవాద్ ఒక వైపు కంప్యూటర్ గేమ్స్ ఆడుతూనే ఇంటర్నెట్‌లోని ఇతర వెబ్‌సైట్‌లను కూడా సెర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ఆర్కుట్ వంటి వెబ్‌సైట్‌లు జవాద్‌‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసేవి. అసలు వెబ్‌సైట్ అనేది ఎలా పనిచేస్తుంది, వీటిని ఎలా తయారు చేస్తారు వంటి ప్రశ్నలు జవాద్‌ను ఎప్పటికప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉండేవి. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధాలను జవాద్ ఎప్పటికప్పుడు దుబాయ్ లో ఉన్న తన సోదరుని ద్వారా అడిగి తెలుసుకునే వాడు.

 

 

మొదటి వెబ్‌సైట్ స్టార్ట్ చేసాడు..

మొదటి వెబ్‌సైట్ స్టార్ట్ చేసాడు..

ఆ తరువాత కొద్దికొద్దిగా అవగాహన పెంచుకుంటూ తొలిగా కన్నూర్ సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను జవాద్ తయారు చేసాడు. అది అంతగా క్లిక్ కాలేదు. పదో తరగతిలో శ్రీరాగ్ అనే మిత్రుడితో కిలిసి ఓ బ్లాగ్‌ను స్టార్ట్ చేయాలనుకున్నాడు. అయితే డొమైన్ రిజిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువని భావించటంతో ఉచితంగా అందుబాటులో ఉన్న ‘.టీకే' అనే డొమైన్ ను తీసుకుని ‘జశ్రీ.టీకే' పేరుతో ఒక వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసారు. ఆ తరువాత శ్రీరాగ్ పైచుదువుల నిమితం అబుదాబి వెళ్లిపోవటంతో ఒంటరి వాడు అయిపోయిన జవాద్ వైబ్‌సైట్‌ల ద్వారా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషన్ ప్రారంభించాడు. తన వెబ్‌సైట్‌కు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి అనుమతి లభించినప్పటికి వెబ్‌సైట్‌కు ఆదరణ లేకపోవడంతో పైసా కూడా సంపాదించలేకపోయాడు.

వైబ్‌డిజైనింగ్ బాట పట్టాడు..

వైబ్‌డిజైనింగ్ బాట పట్టాడు..

2012లో జవాద్ కుటుంబ పరిస్థితులు మరింత దెబ్బతినటంతో పూట గడవటం కూడా కష్టంగా మారిపోయింది. దీంతో తాను సంపాదించాల్సిన అవసరం వచ్చిందని భావించిన జవాద్ వైబ్‌డిజైనింగ్ బాట పట్టాడు. అప్పుడే టీఎన్ఎమ్ ఆన్‌లైన్ సొల్యూషన్స్ పేరుతో ఒక డొమైన్‌ను తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం ప్రారంభించాడు. అయినప్పటికి బిజినెస్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మరింత నిరాశకు లోనైన జవాద్ తన తండ్రి వద్దకు వెళ్లి కన్నూర్ లో ఆఫీర్ ప్రారంభించేందుకు కొంత నగదు కావాలని అడిగాడు.

 

 

కన్నూర్‌లో మొదటి కార్యాలయం..

కన్నూర్‌లో మొదటి కార్యాలయం..

అందుకు అంగీకరించిన తండ్రి కొంత మొత్తంలో డబ్బులు సర్దటంతో, జవాద్ తన 16వ ఏట కన్నూర్‌లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో వెబ్‌డిజైనింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు జవాద్ సంస్థలో ఉద్యోగులుగా ఉన్నారు. జవాద్ తన టీఎన్ఎమ్ సొల్యూషన్స్ ద్వారా చాలా మందిని ఆకర్షించగలిగినప్పటికి వారిని కస్టమర్స్ మార్చలేకపోయాడు. ఆ తరువాత కేరళలో నిర్వహించిన యువ వ్యాపారవేత్తల సమ్మిట్‌ల జవాద్ పాల్గొన్నాడు.

 

 

అదో టర్నింగ్ పాయింట్‌..

అదో టర్నింగ్ పాయింట్‌..

ఈ సమ్మిట్ అతిని జీవితానికో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సమ్మిట్లో తండ్రి పనిచేసిన మలయాళీ వార్తాపత్రికకు చెందిన విలేకరి ఒకరు జవాద్ వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ వార్త అన్ని ఎడిషన్స్‌లోనూ ప్రచురితం అయ్యింది. ఆ క్లిప్పింగ్స్‌ను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో జవాద్ పోస్ట్ చేయటంతో పాటు ఒక్కసారికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో దేశవిదేశాల నుంచి జవాద్‌కు ఫోన్ కాల్స్ రావటం మొదలు పెట్టాయి. ఆ తరువాత నుంచి జవాద్ ఇంకా వెనక్కితిరిగా చూసుకోలేదు.

 

 

ఎస్ఈవోకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు..

ఎస్ఈవోకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు..

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఒక్కో ఎస్ఈవోకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. జవాద్ దుబాయ్ లోనూ ఓ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఈ 22 సంవత్సరాల యువ కెరటానికి ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ రామ్ బుక్సాని అవార్డు కూడా లభించింది. జవాద్ స్థాపించిన టీఎన్ఎమ్ సొల్యూషన్స్ ప్రధానం వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, గూగుల్ ఎస్ఈఓ, ఐటీ కన్సెల్టన్సీ వంటి సేవలను అందిస్తోంది. తన కంపెనీకి టీఎన్ఎం జవాద్ అనే పేరును సూచించిన గూగుల్‌కు తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని జవాద్ అంటున్నాడు.

 

 

Best Mobiles in India

English summary
Brilliant Kannur Youngster Puts Google to Good Use, Becomes Millionaire at 21!.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X