డిజిటల్‌గా మారిన 'బ్రిటానికా ఎన్సైక్లోపీడియా'

Posted By: Prashanth

డిజిటల్‌గా మారిన 'బ్రిటానికా ఎన్సైక్లోపీడియా'

 

న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత పురాతన ఎన్సైక్లోపీడియా 'బ్రిటానికా' ఇప్పుడు డిజిటల్‌ రూపంలో అందించనున్నారు. బ్రిటానికాను ఇకపై పుస్తకరూపంలో ముద్రించబోమని, దానిని డి జిటల్ రూపాల్లో మాత్రమే అందించనున్నామని ఆ కంపెనీ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో యూజర్స్ ఇంగ్లీషు భాష యొక్క ప్రాముఖ్యతను, అనుభవాన్ని అందిస్తుంది.

సుమారు రెండున్నర శతాబ్దాలుగా బ్రిటానికా ప్రపంచవ్యాప్తంగా తన సేవలను అందిస్తుంది. స్కాట్లాండ్‌లో 1768లో తొలిసారిగా ముద్రితమైన ఈ విజ్ఞానసర్వస్వం 244 ఏళ్ల ప్రస్థానం తర్వాత తాజాగా డిజిటల్ రూపంలోకి మారింది. యాజర్స్‌కి డిజిటల్ బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అందుబాటులో ఉంది. దీనితో పాటు బ్రిటానికా ఆన్ లైన్‌లో ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సర్వీసులను అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. బ్రిటానికాకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని సబ్ స్క్రైబ్ ద్వారా అందుకునేందుకు గాను సంవత్సర చందా ధర రూ 3500.

కొత్తగా విడుదల చేసిన బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అప్లికేషన్స్‌ని రూ 100 చెల్లించి చందాదారులుగా చేరవచ్చు. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా డిజిటల్ రంగంలోకి రావడంతో వీకీపిడియాకి గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చివరిసారిగా 2010లో 32 సంపుటాలతో ముద్రితమైన బ్రిటానికా ముద్రిత ప్రతులు ప్రస్తుతం 4 వేల కాపీలే అందుబాటులో ఉన్నాయి. దీని ప్రస్తుత ధర రూ. 69,721. బ్రిటానికా విజ్ఞానసర్వస్వం ముద్రిత ప్రతులు 1990లో రికార్డుస్థాయిలో 1.20 లక్షలు అమ్ముడుపోగా, ఆరేళ్లలోనే ఆ సంఖ్య 40 వేలకు పడిపోయింది. అయితే వికీపీడియా, గూగుల్ సెర్చ్ ఇంజన్‌ల రాకతో బ్రిటానికా అమ్మకాలు తగ్గిపోయాయన్న విషయాన్ని తాము అంగీకరిస్తున్నామని బ్రిటానికా కంపెనీ అధ్యక్షుడు జార్జ్ కాజ్ వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot