లక్షల్లో క్రెడిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే బ్లాక్ చేసుకోండి

బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికులకు కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది.తమ కస్టమర్లు క్రెడిట్‌ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని వాటిని వెంటనే బ్లాక్ చేసుకోవాలని కోరింది.

|

బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికులకు కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది.తమ కస్టమర్లు క్రెడిట్‌ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని వాటిని వెంటనే బ్లాక్ చేసుకోవాలని కోరింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారా, ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీ అయ్యాయని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అలెక్స్‌ క్రూజ్‌ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు.

5 కెమెరాలతో దూసుకొస్తున్న Nokia X7..!5 కెమెరాలతో దూసుకొస్తున్న Nokia X7..!

పాస్‌పోర్టు వివరాలు..

పాస్‌పోర్టు వివరాలు..

ప్రయాణికుడి పేరు, చిరునామా, ఈ-మెయిల్‌ అడ్రస్, క్రెడిట్‌ కార్డు సమాచారాన్ని హ్యాకర్లు సంపాదించారు. అయితే ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలు హ్యాక్‌ కాలేదు' అని క్రూజ్‌ చెప్పారు.

ఆగస్టు 21 - సెప్టెంబర్‌ 5 మధ్య..

ఆగస్టు 21 - సెప్టెంబర్‌ 5 మధ్య..

ఆగస్టు 21 - సెప్టెంబర్‌ 5 మధ్య టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు కార్డులను బ్లాక్‌ చేసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీకి సమాచారం అందించామని చెప్పారు.

పలువురు ప్రయాణికులు..

పలువురు ప్రయాణికులు..

పలువురు ప్రయాణికులు తమ క్రెడిట్‌ కార్డును ఎవరో వాడుకున్నట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయని బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.

డిజిటల్‌ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో..

డిజిటల్‌ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో..

డిజిటల్‌ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో కనీస భద్రత కల్పించకపోవడంపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై ప్రయాణికులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు.

ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం

ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం

బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది మేలో కంప్యూటర్‌ వ్యవస్థలో లోపాల కారణంగా 700కు పైగా విమానాలు హఠాత్తుగా రద్దవడం.. 75వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.

మాల్‌వేర్‌ కారణంగా..

మాల్‌వేర్‌ కారణంగా..

అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్‌ కూడా మాల్‌వేర్‌ కారణంగా తమ ప్రయాణికుల చెల్లింపుల వివరాలు బహిర్గతమయ్యేందుకు ఆస్కారముందని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది.

Best Mobiles in India

English summary
British Airways travelers' credit card details hacked, chief promises to compensate customers more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X