వెబ్ విహారిణిలో చెలరేగాలంటే బ్రౌజర్ టిప్స్ తెలుసుకొవాల్సిందే..

Posted By: Staff

వెబ్ విహారిణిలో చెలరేగాలంటే బ్రౌజర్ టిప్స్ తెలుసుకొవాల్సిందే..

రోజు రోజుకీ పెరుగుతున్న ఇంటర్నెట్ ప్రపంచంలో కొత్త కొత్త బ్రౌజర్లు ఎన్నెన్నో విడుదలవుతుంటాయి. అన్ని బ్రౌజర్స్ గురించి తెలుసుకొకపోయినా కనీసం మన పర్సనల్ కంప్యూటర్‌లో ఎక్కువగా ఉపయోగించే మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ల టిప్స్ గురించి తెలుసుకుంటే మనకు అంతర్జాలంలో సెర్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వాటి యొక్క ఫీచర్స్‌ని ఒక పట్టు పట్టేద్దాం...

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్:

1. వెబ్‌ పేజీల నుంచి కావాల్సిన టెక్ట్స్‌ని కాపీ చేసి ప్రింట్‌ తీసుకోవడానికి ప్రయత్నిస్తే హెచ్‌టీఎంఎల్‌ కోడ్‌ కూడా వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఫాంట్‌ సైజు, బోల్డ్‌, ఇతర ఫార్మెట్‌లో సంబంధం లేకుండా కేవలం టెక్ట్స్‌ని తీసుకోవాలంటే Copy Plain Text సదుపాయాన్ని బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసుకోండి.

2.డౌన్‌లోడ్స్‌ వివరాల్ని చూసేందుకు 'టూల్స్‌' మెనూలోని 'డౌన్‌లోడ్స్‌' ఆప్షన్‌తో పని లేకుండా బ్రౌజర్‌ కింది భాగంలోనే స్టేటస్‌బార్‌లా పొందాలంటే Download Statusbar ఉంది.

3.సాఫ్ట్‌వేర్‌లనుగానీ, విండోలనుగానీ మినిమైజ్‌ చేస్తే టాస్క్‌బార్‌పైనే కూర్చోవడం తెలసిందే. అలా కాకుండా వాటిని సిస్టం ట్రేలో మినిమైజ్‌ అయ్యేలా చేయడం తెలుసా? 'మినిమైజ్‌ టూ ట్రే'తో సాధ్యమే.

4.ముఖ్యమైన వెబ్‌ లింక్‌లను ప్రత్యేక ఫోల్డర్‌లో భద్రం చేసుకోవాలంటే 'సేవ్‌ లింక్‌ ఇన్‌ ఫోల్డర్‌'ను ఉంటే సరి. లింక్‌ను సెలెక్ట్‌ చేసి రైట్‌క్లిక్‌ చేస్తే Save Link in Folder వస్తుంది.

5.ప్రమాదకరమైన సైట్‌ల్లోని స్క్రిప్ట్‌ ఫైల్స్‌ ఆటోమాటిక్‌ రన్‌ కాకుండా సెక్యూరీటీ పెట్టుకోవాలంటే NoScript ఉంది.


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ టిప్స్:


1.మౌస్‌ క్లిక్‌తోనే పనుల్ని చక్కబెట్టేందుకు Mouse Gestures ఉంది. క్లిక్‌తోనే విండోలను క్లోజ్‌, ఓపెన్‌ చేయవచ్చు. Back a page, Switch between tabs లాంటి మరిన్ని పనుల్ని చేయవచ్చు.

2.సైట్‌ల్లోని పాప్‌అప్‌ యాడ్స్‌ని బ్లాక్‌ చేయడానికి Simple adblock పొందండి.

3.ఏదైనా పదంపై మరింత సమాచారాన్ని అక్కడే అందించేదే Apture Highlights. నిక్షిప్తం చేసిన తర్వాత పదాన్ని సెలెక్ట్‌ చేస్తే చాలు బాక్స్‌లో పదానికి సంబంధించిన నిర్వచనం, ఫొటోలు, ఇతర సమాచారం కనిపిస్తుంది.

4. మెయిల్‌, బ్లాగులు, ఫొరమ్స్‌లో టైప్‌ చేసిన టెక్ట్స్‌లోని అక్షర దోషాల్ని సరి చేసుకోవాలంటే ieSpellతో చాలా సులభం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting