రక్షణ కోసం ఈ అంపైర్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే
ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ బ్రూస్ అక్సెన్ ఫోర్డ్ మైదానంలో అంపైరింగ్ చేసే సమయంలో చేతికి ఓ లాలీపాప్ లాంటి దాన్ని కట్టుకోవడం చాలామందే చూసి ఉంటారు. అయితే ఆయన అలా ఎందుకు కట్టుకున్నారు. మిగతా అంపైర్లు కట్టుకోకుండా ఈయనే ప్రత్యేకంగా ఎందుకు కట్టుకున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే దీని వెనుక ఓ పెద్ధ కథ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతికి బాల్ నేరుగా అంపైర్ తలకు తగిలి మరణించిన కథ గురించి తెలిస్తే నిజంగానే దీని అవసరం చాలా ఉందని మీరు చెప్తారు. అదేంటో చూద్దాం.

బంతి తలకు తగలి అంపైర్ మరణం
2014వ సంవత్సరంలో ఇజ్రాయేలులో జరిగిన మ్యాచ్‌లో బంతి తలకు తగలి ఓ అంపైర్ మరణించాడు. బౌలర్లకు, బ్యాట్స్‌మన్‌కు రక్షణ కోసం గ్లౌజులు, ప్యాడ్‌లు, హెల్మెట్‌లు, చాతి నుంచి మొదలుకొని.. మోచేతులతో సహా ప్రత్యేక సౌకర్యాలతో ప్యాడ్‌లు ఉండనే ఉంటాయి. మరి అదే సౌకర్యం అంపైర్లకో.. ఈ విషయానికొస్తే, క్రీజులో బ్యాట్స్‌మన్‌కు ఎదురుగా నిల్చొని మ్యాచ్‌ను జడ్జ్ చేయడం అంపైర్ విధి. దీంతో ఇప్పుడు రక్షణలోనూ వాళ్లకు ధీటుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

అంపైర్ బ్రూస్ తన రక్షణ కోసం
ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లను గమనించినట్లైతే ఎడమచేతికి ఫైబర్ ప్లాస్టిక్‌తో చేసిన ఒక పరికరాన్ని ఓ అంపైర్ ధరించడం చూసే ఉంటారు. మోచేతి నుంచి మణికట్టు వరకు నిటారుగా ఉండి ఆ తర్వాత సర్కిల్ ఉండే ఈ పరికరాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ బ్రూస్ అక్సెన్ ఫోర్డ్ తన రక్షణ కోసం తయారుచేసుకున్నాడు.

2015 ఐపీఎల్ నుంచి వాడుతున్నాడు
ఓ లాలిపప్‌ను పోలి ఉండే పరికరాన్ని అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ తన ఎడమచేతికి సరిపోయే విధంగా తయారుచేసుకున్నాడు. అతను దీన్ని 2015 ఐపీఎల్ నుంచి వాడుతున్నాడు. ఆ ప్యాడ్ ఆరు మిల్లీ మీటర్ల మందంతో పాలి కార్డొనేట్ పదార్థంతో తయారుచేయబడింది.
షీల్డ్‌కు తగిలి ఎవరైనా క్యాచ్ అందుకుంటే
ఒకవేళ బంతి అతని షీల్డ్‌కు తగిలి ఎవరైనా క్యాచ్ అందుకుంటే దాన్ని కూడా అవుట్‌గానే పరిగణిస్తారట. అంతేకాదు, అంతర్జాతీయ మ్యాచ్ లలో సైతం మొట్టమొదటి సారి హెల్మెట్ వాడింది కూడా బ్రూస్ కావడం విశేషం.

వేగంగా దూసుకొచ్చే బంతి నుంచి
టీ20ల్లో బాదడమే ప్రధానం కావడంతో వేగంగా దూసుకొచ్చే బంతి నుంచి కాపాడుకోవడం కోసం దీన్ని ఫోర్డ్ వాడుతున్నాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో, న్యూజిలాండ్, భారత్ వన్డే సిరీస్ (2016)లోనూ ఈ పరికరాన్ని ధరించాడు. మైదానంలో అంపైర్ల రక్షణ కోసం బ్రూస్ చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications








