BSNL 2022 సమ్మర్ ఆఫర్: ఈ దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అధిక వాలిడిటీ పొందవచ్చు
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. గతంలో మెరుగైన సేవలు అందించినప్పటికీ ప్రైవేట్ టెల్కోల రాకతో మరియు 4G నెట్ వర్క్ సేవలు లేకపోవడంతో కొద్దిగా వెనకబడింది. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవతో 4G మరియు 5G నెట్ వర్క్ లను అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నాలు చేస్తున్నది. BSNL ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొత్తగా సమ్మర్ ఆఫర్‌ను విడుదల చేసింది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది అని గమనించాలి. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని కంపెనీ ఇంకా పేర్కొనలేదు. ఈ సమ్మర్ ఆఫర్‌ను రూ.2399 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తోంది. రూ.2399 ప్లాన్ యొక్క సమ్మర్ ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ సమ్మర్ ఆఫర్
BSNL ప్రభుత్వ టెల్కో రూ.2399 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో సమ్మర్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా కాలర్ ట్యూన్స్ సర్వీసును మరియు Eros Nowకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ని కూడా లభిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. కానీ సమ్మర్ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు 60 రోజుల అదనపు వాలిడిటీని కూడా పొందుతారు. అంటే వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 425 రోజుల చెల్లుబాటు కాలంతో అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు.

BSNL రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ విలువైనదేనా లేదా అనేది వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఇది అధిక మొత్తంలో డేటాను అది కూడా హై-స్పీడ్ తో కోరుకునే వ్యక్తుల కోసం రూపొందించిన ప్లాన్ కాదు. BSNLకి 4G నెట్‌వర్క్ లేకపోవడంతో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేయడానికి వీలుపడదు. దీని అర్థం మీరు 2GB రోజువారీ డేటాను పొందినప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా లేకపోవడంతో అది మీకు ఉపయోగపడకపోవచ్చు. అయితే ఈ ప్లాన్ తగినంత మొత్తంలో డేటాను వినియోగిస్తూ కేవలం ఫోన్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్న వారి కోసం అనువుగా ఉంటుంది. అటువంటి వారు ఎలాంటి చింత లేకుండా ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

BSNL యొక్క సమ్మర్ ఆఫర్‌లో మరిన్ని దీర్ఘకాలిక ప్లాన్‌లు కూడా ఉన్నాయి. BSNL తన వినియోగదారుల కోసం ఈ రకమైన అదనపు చెల్లుబాటు ఆఫర్‌లను అందించడం కొత్త కాదు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ టెల్కో ప్రస్తుతం భారతదేశంలో 4G నెట్‌వర్క్‌ను విడుదల చేయడానికి తన యొక్క ప్రయత్నాలను శరవేగంగా చేస్తోంది. 4G నెట్‌వర్క్‌ల మద్దతు అందుబాటులోకి వస్తే కనుక ఈ ప్లాన్‌లు ప్రస్తుతం ప్రైవేట్ టెల్కోలు అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాల కంటే మరింత విలువైనవిగా ఉంటాయి.

BSNL రూ.797 వోచర్ ప్లాన్
BSNL టెల్కో రూ.797 ధర వద్ద అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందించబడుతుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. 60 రోజుల తర్వాత ప్రయోజనాల గడువు ముగుస్తుంది కానీ SIM కార్డ్ సంవత్సరం పొడవునా యాక్టీవ్ దశలో ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క సాధారణ వాలిడిటీ 395 రోజులు. అయితే జూన్ 12, 2022 లోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు BSNL ఈ ప్లాన్‌తో 30 రోజుల అదనపు చెల్లుబాటును కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications