రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకునేందుకు రూ.100 లోపు బెస్ట్ Plans ఇవే!

|

BSNL నెట్‌వ‌ర్క్‌ను ప్రైమ‌రీ సిమ్‌గా ఉప‌యోగించ‌డానికి సరైన‌ది కాన‌ప్ప‌టికీ.. రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవ‌డానికి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మొబైల్‌లో రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాల‌ని భావించే వారికి BSNL త‌క్కువ ధ‌ర‌లో అద్భుత‌మైన ప్లాన్ల‌ను అందిస్తోంది. ప్రత్యేకించి చిన్న చిన్న ప‌నులు చేసుకునేవారు ఎక్కువ ధ‌ర చెల్లించి ప్లాన్ల‌ను పొంద‌లేరు.. కాబ‌ట్టి అలాంటి వారికి కూడా సిమ్‌కార్డు యాక్టివ్‌గా ఉంచుకునేందుకు BSNLప్లాన్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈరోజు, మేము BSNL నుండి రూ. 100లోపు ధ‌ర క‌లిగిన‌ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఇవి త‌క్కువ ధ‌ర‌లోనే సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 
రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకునేందుకు రూ.100 లోపు బెస్ట్ Plans ఇవే!

BSNL రూ.87 ప్లాన్‌:
ఈ BSNL రూ.87 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం మొబైల్ గేమింగ్ బెనిఫిట్స్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది. ప్ర‌స్తుతం టెలికాం ఇండస్ట్రీలో అత్యంత త‌క్కువ ధ‌రలో బెస్ట్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది.

BSNL రూ.97 ప్లాన్‌:
రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాల‌నుకునే యూజ‌ర్ల‌కు ఇది కూడా బెస్ట్ ప్లాన్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా ఎస్ఎంఎస్ లు క‌ల్పించ‌డం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది.

రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకునేందుకు రూ.100 లోపు బెస్ట్ Plans ఇవే!

BSNL రూ.99 ప్లాన్‌:
ఈ BSNL రూ.99 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు పీఆర్‌బీటీ బెనిఫిట్స్ కూడా పొంద‌వ‌చ్చు. మీరు డేటా గురించి అస్సలు పట్టించుకోనట్లయితే మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రమే కావాలనుకుంటే కనుక మీరు STV_99 ప్లాన్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది.

అదేవిధంగా, బీఎస్ఎన్ఎల్ నుంచి ఇటీవల విడుద‌లైన రెండు మంత్లీ ప్లాన్స్ గురించి కూడా తెలుసుకుందాం:
BSNL Rs. 228 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 228 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది.

 
రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకునేందుకు రూ.100 లోపు బెస్ట్ Plans ఇవే!

BSNL Rs. 239 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 239 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రూ.10 టాక్‌టైమ్ పొంద‌వ‌చ్చు. ఈ టాక్‌టైమ్ వాల్యూ మెయిన్ అకౌంట్‌కు యాడ్ చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఒక నెల ఉంటుంది. ప్లాన్ గ‌డువు ముగిసిన త‌ర్వాత అదే రోజున సేమ్ అమౌంట్ చెల్లించి మ‌ళ్లీ రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్ల‌కు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ల‌తో పాటుగా, నెల రోజుల గ‌డువు ఉండే వ్యాలిడిటీ ప్లాన్ల‌ను అందించాల‌ని ఇటీవ‌ల ట్రాయ్ నెట్‌వ‌ర్క్ కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో BSNL ఈ ప్లాన్ల‌ను విడుద‌ల చేయ‌డం విశేషం. అయితే BSNL విడుద‌ల చేసిన ప్లాన్లు, ఇప్ప‌టికే Airtel, Vi నుంచి విడుద‌లైన ఇదే త‌ర‌హా ప్లాన్ల‌కు పోటీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
BSNL 3 Prepaid Plans Under Rs 100 for Keeping SIM Active

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X