BSNL 3GB రోజువారి డేటా ప్లాన్‌లు!! రూ.78 నుండి ప్రారంభం...
ఇండియాలోని టెలికామ్ రంగంలో ఒకటైన బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం సహాయం పొందిన తరువాత వినియోగదారులను ఆకట్టుకోవడానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పుడు సంస్థ రోజువారీ 3GB డేటా ప్రయోజనాలను అతి తక్కువ ధరకే అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ 3GB రోజువారి డేటా ప్లాన్ వివరాలు
బిఎస్ఎన్ఎల్ టెల్కో సంస్థ యొక్క 4G సేవలు ప్రస్తుతం ఇండియా అంతటా అందుబాటులో లేనప్పటికీ టెల్కో యొక్క 3GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెడుతుంది. ప్రస్తుత సమయంలో చాలా మంది ప్రజలు రోజువారీ డేటాలో 2GB కంటే ఎక్కువ కోరుకుంటారు. రిలయన్స్ జియో, వోడాఫోన్ మరియు భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు చాలా ఖరీదైనవి. కానీ బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు రోజువారి 3GB డేటా ప్లాన్‌లను అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో చాలా తక్కువ ధరకు అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.78 ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను కేవలం రూ.78 ధర వద్ద అందిస్తుంది. ఇది ప్లాన్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను 8 రోజుల అతి తక్కువ చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అపరిమిత కాలింగ్ లో రోజుకు 250 నిమిషాల పరిమితి ఉండడం గమనార్హం. రోజువారి 3GB డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క 8 రోజుల వాలిడిటీ కాలంలో ఈరోస్ నౌ యొక్క కాంప్లిమెంటరీ చందాను కూడా అదనంగా అందిస్తుంది.

BSNL STV 247 ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్ఎన్ఎల్ సంస్థ రోజువారీ 3GB డేటాను అందిస్తున్న మరొక ప్లాన్ ఇది. రూ.247 ధర వద్ద లభించే ఈ ప్లాన్ రోజుకు 250 నిమిషాల FUP పరిమితితో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని 36 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రోజువారి 3GB డేటా FUP పరిమితి దాటిని తరువాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా భారతదేశంలోని దాదాపు ప్రతి టెలికం సర్కిల్‌లో అందుబాటులో ఉంది.

BSNL PV 997 ప్లాన్ పూర్తి వివరాలు
BSNL యొక్క PV 997 ప్లాన్ అందరికీ అందుబాటులో లేదు. BSNL అందిస్తున్న ఈ ప్లాన్ తో వినియోగదారులు 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. కాని మొదటిసారి రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులు దాని 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని మాత్రమే పొందగలరు. అలాగే 997 రూపాయల విలువ గల మొదటి రీఛార్జ్ కూపన్ (FRC)ను కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 250 నిమిషాల FUP పరిమితితో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. రోజువారి 3GB డేటా అయిపోయిన తరువాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం 80 Kbps కి తగ్గించబడుతుంది. కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ నుండి రెండు నెలల ఉచిత కాలర్ ట్యూన్లను కూడా ఉచితంగా పొందుతారు. ఇది హర్యానా, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ మినహా భారతదేశంలోని దాదాపు ప్రతి టెలికం సర్కిల్‌లో అందుబాటులో ఉంది.

BSNL Rs 1999 Plan ప్లాన్ పూర్తి వివరాలు
బిఎస్ఎన్ఎల్ సంస్థ 3GB డేటా ప్రయోజనంతో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. కానీ దాని ధరకు తగ్గట్టుగా ఇది 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల FUP పరిమితి అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. రోజువారి 3GB డేటా అయిపోయిన తరువాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం 80 Kbps కి తగ్గించబడుతుంది. దానితో పాటు రోజుకు 100 SMS ప్రయోజనం కూడా ఉంది. లడఖ్, జమ్మూ కాశ్మీర్, మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు మినహా భారతదేశంలోని దాదాపు ప్రతి టెలికం సర్కిల్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








