తక్కువ ధరలో BSNL రోజువారి 3GB డేటా ప్లాన్‌లు!! ప్రైవేట్ టెల్కోలకు పోటీగా...

|

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ విభాగంలో తన వినియోగదారులకు సరసమైన ధరల వద్దనే అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్ గతంలో రూ.200 ధర లోపు కూడా రోజుకు 3GB డేటాను అందించేది. అయితే బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటికి కూడా దేశం అంతటా 4G సర్వీసులు లేకపోవడం అనేది ఒక పెద్ద లోపంగా భావించవచ్చు.

BSNL vs ప్రైవేట్ టెల్కోలు
 

BSNL vs ప్రైవేట్ టెల్కోలు

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 4G టారిఫ్ ప్లాన్‌లను రోజుకు 3GB డేటాతో అందిస్తున్నాయి. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికీ 3G / 2G ప్లాన్‌లను మాత్రమే అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ సంస్థ పరిశ్రమలో ఇప్పటికి ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది. అయితే ప్రైవేట్ టెల్కోలు ప్రస్తుతం 3GB రోజువారీ డేటా ప్లాన్‌లను సుమారు 400 రూపాయలకు అందిస్తున్నాయి. అయితే BSNL 250 రూపాయల కన్నా తక్కువ ధరతోనే ఇలాంటి ప్లాన్‌లను అందిస్తున్నాయి. BSNL అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Also read: Excitel బ్రాడ్‌బ్యాండ్ లాంగ్-టర్మ్ హై-స్పీడ్ ప్లాన్‌లను నెలకు రూ.499 మాత్రమే...

BSNL రూ.247 ప్రీపెయిడ్ STV ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.247 ప్రీపెయిడ్ STV ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ రూ.247 ధర వద్ద అందిస్తున్న STV ప్లాన్ అనేది చాలా మంచి సమర్పణ. ఇది లోకల్ మరియు జాతీయ రోమింగ్ సర్కిల్‌లలో అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది అయితే ఇది రోజుకు 250 నిమిషాలకు పరిమితం చేయబడింది. డేటా ప్రయోజనంలో వినియోగదారులు రోజుకు 3GB ని అధిక వేగంతో బ్రౌజ్ చేయవచ్చు. తరువాత డేటా స్పీడ్ 80 Kbps కు తగ్గించబడుతుంది. రోజుకు 100SMS లు కూడా ఉన్నాయి.

BSNL రూ.247 ప్రీపెయిడ్ STV ప్లాన్ అదనపు డేటా ప్రయోజనాలు

BSNL రూ.247 ప్రీపెయిడ్ STV ప్లాన్ అదనపు డేటా ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ రూ.247 STV ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క వాలిడిటీ సమయం 30 రోజులు. అయితే ప్రచార ఆఫర్‌లో భాగంగా STV 247 ప్లాన్ ప్రస్తుతం 40 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన STV 247 ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలంలో 120GB డేటాను అందిస్తుంది. ఇతర టెల్కోలతో పోలిస్తే ఇందులో 50GB ఎక్కువ డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నది. STV 247 యొక్క అదనపు వాలిడిటీ ప్రమోషనల్ ఆఫర్ నవంబర్ 30, 2020 తో ముగుస్తుంది.

ఎయిర్టెల్, Vi మరియు జియో 3GB రోజువారి డేటా ప్లాన్‌లు
 

ఎయిర్టెల్, Vi మరియు జియో 3GB రోజువారి డేటా ప్లాన్‌లు

రిలయన్స్ జియో ప్రస్తుతం రూ.349 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 3GB డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నది. ఇందులో అన్‌లిమిటెడ్ జియో టు జియో వాయిస్ కాలింగ్, 1000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) రెండింటిలో రూ.398 ధర వద్ద గల ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB డేటా మరియు దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీ సమయానికి అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL 3GB Daily Data Prepaid Plans Under Rs.250

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X