BSNL 4G రాకతో ప్రైవేట్ టెల్కోల 5Gపై తీవ్ర ప్రభావం...

|

ఇండియాలోని టెలికాం రంగంలో ఒకప్పుడు రారాజుగా ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో తరువాత అనేక ఒడిదుడుకులను ఎదురుకుంటున్నది. ప్రైవేట్ టెల్కోలు ఇప్పుడు 5G ని అందుబాటులోకి తీసుకొని రావాలని చూస్తుంటే BSNL మాత్రం 4Gవైపు అడుగులు వేస్తున్నది. అయితే ఇది అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ టెల్కోల మీద తీవ్ర ప్రభావం పడనున్నది. ఇది నిజం ఇది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ని తిరిగి అభివృద్ధి చేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ దేశం మొత్తం మీద 4G రోల్‌అవుట్ మరియు సైట్ అప్‌గ్రేడ్‌ల కాపెక్స్‌ను కూడా కవర్ చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ టెల్కో తన వినియోగదారులకు మరింత వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రైవేట్ టెల్కోలు 5Gకి మారుతున్న సమయంలో BSNL 4Gకి ఎందుకు వెళుతోంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ త్వరలోనే BSNL 5G NSAని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుండడంతో దానికి 4G కోర్ అవసరం ఎంతైనా ఉంది. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027లో భారతదేశంలోని మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లలో 55% పైగా 4Gని కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంటే ఐదేళ్ల తరువాత కూడా ఎక్కువ మంది వినియోగదారులు 4G మొబైల్ సేవలను ఉపయోగిస్తుఉంటారు.

ప్రైవేట్ టెల్కోల 5G నెట్‌వర్క్‌ Vs BSNL 4G నెట్‌వర్క్‌
 

ప్రైవేట్ టెల్కోల 5G నెట్‌వర్క్‌ Vs BSNL 4G నెట్‌వర్క్‌

ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌ ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నప్పుడే టెల్కోలు అన్ని కూడా రెండు సార్లు తమ యొక్క అన్ని రకుల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ల యొక్క ధరలను పెంచాయి. ఒక్క ప్రభుత్వ టెల్కో BSNL మాత్రమే తమ యొక్క ప్లాన్ ల ధరలను పెంచలేదు. ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాలలో ప్రైవేట్ టెల్కోల వినియోగదారులు నెట్‌వర్క్‌ సమస్యలతో బాధపడుతున్నారు. BSNL కి మాత్రం ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ కోసం నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురుకోలేదు. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే కనుక ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరు మల్లి BSNL సిమ్ ని ఎంచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

BSNL 4G తక్కువ టారిఫ్‌లతో కొత్త కస్టమర్ల ఆకర్షన

BSNL 4G తక్కువ టారిఫ్‌లతో కొత్త కస్టమర్ల ఆకర్షన

BSNL ప్రైవేట్ పోటీదారుల కంటే తక్కువ టారిఫ్‌లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించగలదు. BSNL పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే కొన్ని అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉండే విలువతో మాత్రమే పెరుగుతాయి. BSNL ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, 2022న 4G నెట్‌వర్క్‌లను సాఫ్ట్‌గా ప్రారంభించాలని భావిస్తున్నారు. 2022 చివరి నాటికి దేశం మొత్తం మీద విస్తృతంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో BSNL తన 4G నెట్‌వర్క్‌లతో దేశం మొత్తాన్ని కవర్ చేయాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి ప్రభుత్వం USOF ప్రాజెక్ట్‌ల కోసం BSNLని కూడా ఎంపిక చేస్తోంది.

అధిక ధర వద్ద 5G నెట్‌వర్క్‌

అధిక ధర వద్ద 5G నెట్‌వర్క్‌

గత రెండు సంవత్సరాలుగా ఇంటి వద్ద పనిచేస్తున్న వినియోగదారులు తమ యొక్క పనిని పూర్తి చేయడం కోసం 4G నెట్‌వర్క్‌ల మీద అధికంగా ఆధారపడ్డారు. 4G నెట్‌వర్క్‌లతోనే తమ పనిని పూర్తి చేయగలిగినప్పుడు అధిక టారిఫ్‌ల వద్ద లభించే 5G నెట్‌వర్క్‌లను ఎంచుకోవడం అనేది కొద్దిగా ఆలోచించే విషయమే. దేశం మొత్తం మీద మారుమూల ప్రాంతాలలో కూడా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లు విస్తరిస్తున్నందున వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వినియోగదారులు అపరిమిత డేటాతో వాటిపై ఆధారపడవచ్చు.

స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్‌వర్క్‌లు

స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్‌వర్క్‌లు

భారత ప్రభుత్వం BSNL స్వదేశీ 4Gని వీలైనంత త్వరగా ప్రారంభించగలదని నిర్ధారించడానికి చూస్తోంది. స్వదేశీ 4G స్టాక్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ-ఆధారిత టెల్కో C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) మరియు TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)తో కలిసి పని చేసింది. Jio, Airtel మరియు Vi (Vodafone Idea) 5Gపై దృష్టి పెడతాయి, అయితే అవి ఇప్పటికీ 4G విభాగంలో భారీగా పోటీ పడతాయి. BSNL యొక్క ప్రవేశం పోటీని మరింత ఎక్కువ చేస్తుంది, ఇది వాస్తవానికి రోజు చివరిలో వినియోగదారులకు మంచిది.

BSNL అప్‌గ్రేడ్ సర్వీసులు

BSNL అప్‌గ్రేడ్ సర్వీసులు

BSNL టెలికాం సంస్థ భారతదేశంలో ముందుగా 4G సేవలను అందించడానికి 900 MHz మరియు 1800 MHz బ్యాండ్‌లలో 4G స్పెక్ట్రమ్‌ను కేటాయించబడుతుంది. దీనికి సుమారు రూ.44,993 కోట్లు ఖర్చుచేయనున్నది. BSNL దేశీయంగా అభివృద్ధి చేసిన 4G స్టాక్‌ను అమలు చేస్తున్నందున రాబోయే నాలుగేళ్లలో వాటి కాపెక్స్ అవసరాల కోసం సుమారు రూ.22,471 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం సమకూర్చనున్నది. మూడవది వాణిజ్యపరంగా అధిక ఆసక్తి లేని ప్రాంతాల్లో సేవలను అందించడం కోసం భారత ప్రభుత్వం నుండి BSNL రూ.13,789 కోట్లను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో అందుకుంటుంది. ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం రూ.13,789 కోట్లు ఇవ్వనుంది. నాలుగవది AGR బకాయిలు, స్పెక్ట్రమ్ కేటాయింపు మరియు కాపెక్స్ కేటాయింపులకు బదులుగా ప్రభుత్వం BSNL యొక్క అధీకృత మూలధనాన్ని రూ. 40,000 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు పెంచింది.

Best Mobiles in India

English summary
BSNL 4G Can Still be a Deal Breaker While Jio, Airtel, Vi Private Telcos Focus on 5G

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X