BSNL 4G Telangana తెలంగాణకు BSNL గుడ్‌న్యూస్.. 4G సేవలపై కీలక ప్రకటన..!
BSNL దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలు సహా పర్వత ప్రాంతాల్లోనూ 4G టవర్ లను ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 50,708 4G టవర్ల ను ఏర్పాటు అయ్యాయి. అందులో 41,957 సైట్లలో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని సమాచారం. 2025 మధ్య నాటికి పూర్తిస్థాయిలో లక్ష BSNL 4G టవర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమైన సైట్ల కు డివైజ్ లను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరికరాలు అన్నీ 5G నెట్‌వర్క్ ను కూడా సపోర్టు చేస్తాయని సమాచారం. BSNL 4G నెట్‌వర్క్ కు సంబంధించిన టెక్నాలజీని TCS సాయంతో సమకూర్చుకుంది. నిర్వహణ బాధ్యతలను కూడా ఈ సంస్థ చూడనుందని తెలుస్తోంది.

తాజాగా తెలంగాణ ప్రజలకు BSNL గుడ్ న్యూస్ (BSNL Telangana) చెప్పింది. 4G కోర్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను X అకౌంట్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనున్నారని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో BSNL నెట్‌వర్క్ లోకి యూజర్లు వచ్చి చేరుతున్నారు.
BSNL 5G సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలు, భవనాల ద్వారా నగదు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఖాళీ స్థలాలను విక్రయించేందుకు మరియు భవనాలను అద్దెకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోని స్థలాలు, బిల్డింగ్ లను గుర్తించారు.
We @bsnl_tt are happy to announce that 4G Core Network has officially gone live in the Telangana Circle under the leadership of CGMT, Telangana!
— BSNL_Telangana (@bsnl_tt) November 30, 2024
A big thank you to our @CMDBSNL, Director (CM) and the entire @TCS team for their support.
Customers can now blazing fast speed. pic.twitter.com/oWGdpPU975
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI- ట్రాయ్) లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో సుమారు 8 లక్షల మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్‌లోకి పోర్టింగ్ అయ్యారు. జులై, ఆగస్టు నెలల్లోనూ భారీ సంఖ్యలో మొబైల్ యూజర్లు BSNL లో చేరారు. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VI) సంస్థలు భారీగా యూజర్లను కోల్పోతున్నాయి.
TRAI వివరాల ఆధారంగా జులై నెలలో 29.2 లక్షలు, ఆగస్టులో 24.3 లక్షలు, సెప్టెంబర్‌లో 8.4 లక్షలు యూజర్లు BSNL నెట్‌వర్క్ ను ఎంచుకున్నారు. ఇతర టెలికాం ప్రొవైడర్ లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉండడం సహా త్వరలో 4G, 5G నెట్‌వర్క్ ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుండడంతో ఎక్కువ మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
BSNL ఇటీవల కొత్త లోగోను ఆవిష్కరించింది. దీంతోపాటు 500 లకు పైగా ఛానళ్లతో లైవ్ టీవీ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సదుపాయం అందుబాటులో లేదు. దీంతోపాటు నేషనల్ వైఫై రోమింగ్ సేవలను కూడా ప్రారంభించింది. FTTH యూజర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. దీంతోపాటు డైరెక్ట్ టు డివైస్ (D2D) సేవలను ప్రారంభించింది. అయితే ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








