Home
News

BSNL 4G నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ మరింత ఆలస్యం కానున్నది!! కారణాలు ఏమిటో తెలుసా??

ఇండియాలోని ఏకైక ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యొక్క వినియోగదారుల కోసం సెప్టెంబర్ 2022 నాటికి 4G నెట్‌వర్క్‌లను లాంచ్ చేస్తుందని ఆన్‌లైన్‌లో వార్తలు వస్తున్నప్పటికీ అది జరిగే అవకాశం లేదు అని కొన్ని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణలోని టెల్కో యొక్క 4G ట్రయల్స్ ఆలస్యం కావడమే దీనికి కారణం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహాయంతో BSNL తన దేశీయ 4Gని పరీక్షిస్తోంది. BSNL ఈ ట్రయల్‌ను అక్టోబర్ 31, 2021లోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ఈ 4G ట్రయల్స్ జనవరి 15, 2021 వరకు పొడిగించబడ్డాయి. అయితే BSNL యొక్క 4G సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్న విషయాలను తెలుసుకోవడానికి చదవండి.

TCSతో BSNL సమస్యలు

TCSతో BSNL సమస్యలు

TCS ఆసక్తి వ్యక్తీకరణ (EoI) నిబంధనలను గౌరవించకపోవడంపై BSNL ఆందోళనలు చేసింది. స్వదేశీ 4G ప్రదర్శన కోసం 40W రేడియోలను ఉపయోగించాల్సిందిగా ప్రభుత్వ ఆధీనంలోని టెల్కో TCSని కోరింది. కానీ TCS ఎక్కువగా 20W రేడియోలను అమర్చింది. 20W రేడియోలతో ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి. అయితే BSNL కోసం దాని ఉపయోగం సమర్థవంతమైన మార్గం కాదు. కొన్ని నివేదికల ప్రకారం TCS డిసెంబర్ 20 నాటికి ఎంపిక చేసిన సైట్‌లలో 40W రేడియోలను సెటప్ చేయనున్నది. ఆ తర్వాత డిసెంబర్ 23న BSNL ట్రయల్స్‌ను ప్రారంభించాలని ముందుగా ప్రణాళికలను వేసుకున్నారు. కానీ ఇప్పటివరకు BSNL విషయంలో ఎటువంటి ప్రణాళికలు అనుకున్నవి ముందుగా జరిగినట్లుగా లేదు. కావున ఈ ట్రయల్స్ జనవరి 15, 2021 వరకు పొడిగించబడవచ్చు. ఒక్కసారి ఆలస్యం చేస్తే ప్రభుత్వ టెల్కో యొక్క 4G నెట్‌వర్క్‌ల PAN-ఇండియా లాంచ్ 2023కి ముందుకు వస్తుంది.

BSNL

ప్రభుత్వం ఆదేశించినట్లుగా BSNL భారతదేశంలో తన 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించేందుకు స్వదేశీ నెట్‌వర్క్ కోర్ మరియు పరికరాలను మాత్రమే ఉపయోగించగలదు. BSNL యొక్క 4G నెట్‌వర్క్‌లు దేశ పౌరులకు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. అంతేకాకుండా స్వదేశీ 5Gని ప్రారంభించడంలో ప్రభుత్వ టెల్కో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది.

4G అప్‌గ్రేడ్

భద్రతా కారణాలను ఉదహరిస్తూ నోకియా పరికరాలతో దక్షిణ మరియు పశ్చిమ భారతదేశం అంతటా 13,533 సైట్‌లను 4Gకి అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ బోర్డులోని ప్రభుత్వ నామినీలు BSNLకి అనుమతి ఇవ్వలేదు. 5G నెట్‌వర్క్‌లను ప్రారంభించే అంచున ఉన్న ప్రైవేట్ ఆపరేటర్‌లకు పోటీగా BSNLకి వీలైనంత వేగంగా 4G నెట్‌వర్క్‌లు అవసరం.

BSNL రూ.599 ప్లాన్

BSNL రూ.599 ప్లాన్

ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యొక్క వినియోగదారులకు STV_WFH_599 దీర్ఘకాలిక మరియు అధిక డేటా ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.599 ధర వద్ద అందిస్తున్నది. ఇది రోజుకు 5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. సెట్ డేటా పరిమితి వినియోగాన్ని పోస్ట్ చేసిన తర్వాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 84 రోజులు. ముంబై మరియు ఢిల్లీలో రోమింగ్‌తో సహా హోమ్ LSA మరియు నేషనల్ రోమింగ్‌లో వినియోగదారులు నిజంగా అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్ జింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులు వేలాది పాటలు, చలనచిత్రాలు మరియు ఇతర వినోద కంటెంట్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు 00:00 గంటల నుండి 05:00 గంటల వరకు అపరిమిత డేటాను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది.

BSNL -  Eros Now ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఒప్పందం

BSNL - Eros Now ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఒప్పందం

BSNL టెల్కో ఎంపిక చేయబడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఈరోస్ నౌ కంటెంట్ ఉచితంగా యాక్సిస్ చేయడానికి తన వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. అయితే కొత్త ఒప్పందంలో భాగంగా Eros Now ఫ్రీ సబ్స్క్రిప్షన్ తో కూడిన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. Eros Now ఆఫర్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు 8 రోజుల చెల్లుబాటుతో రూ.78 ప్యాక్, మరియు రూ.98 ప్లాన్ 20 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ రూ.297 ధర ఉన్న ఆంధ్రప్రదేశ్ మినహా 54 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ. 298 BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌పై కూడా వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL 4G Network Upgrade is Going to be Further Delayed! Might Comes by 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X