Home
News

BSNL 4G సిమ్ ఉచిత ఆఫర్ గడువు మరింత పెరిగింది!! మెరుగైన ఆఫర్స్ ఎన్నో....

ఇండియా యొక్క టెలికాం రంగంలో కొన్ని సంవత్సరాల ముందు మకుటం లేని రారాజుగా ఎదిగిన ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తరువాత ప్రవేట్ టెల్కోల దాటికి దాదాపుగా మూసివేసే వరకు వచ్చింది. కానీ ప్రభుత్వ చరువతో తిరిగి పొంజుకొని వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్లను ప్రారంభిస్తోంది. అందులో బాగంగానే తన 4G సిమ్ కార్డును ఉచితంగా ఇటీవల ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఉచిత 4G సిమ్ కార్డ్ ఆఫర్‌ను డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

BSNL

వినియోగదారులు ఇప్పుడు రూ.100 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొదటి రీఛార్జ్ కూపన్‌ను పొందాలనుకునే వినియోగదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి BSNL తన కేరళ సర్కిల్‌లో ఉచిత SIM కార్డ్ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఆఫర్‌ను ఇతర టెలికాం సర్కిల్‌లకు కూడా విస్తరిస్తున్నట్లు నివేదించింది. వినియోగదారులు రూ.100 కంటే అధిక మొత్తంతో రీఛార్జ్ చేయడం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా BSNL కి పోర్ట్ అవ్వవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL యొక్క కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరియు ఇతర ఆపరేటర్ల నుండి BSNL నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే వారికి ఇప్పుడు ఉచితంగా 4G సిమ్ కార్డులను సంస్థ అందిస్తోంది. ప్రారంభంలో ఈ ఆఫర్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. తరువాత ఇది సెప్టెంబర్ వరకు ఆఫర్‌ను పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫర్ డిసెంబర్ వరకు పొడిగించబడినట్లు సంస్థ నివేదించింది. సాధారణంగా BSNL యొక్క 4G SIM కార్డ్ రూ.20 ధర వద్ద లభిస్తుంది. ఇది కొత్త వినియోగదారులకు మరియు MNP పోర్ట్ వినియోగదారులకు రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మినహాయించబడుతుంది. ఈ BSNL ఉచిత 4G సిమ్ ఆఫర్ BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్స్ (BSNL) మరియు రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా పొందవచ్చు.

BSNL ప్రమోషనల్ ప్లాన్స్

BSNL ప్రమోషనల్ ప్లాన్స్

ఉచిత 4G సిమ్ ఆఫర్‌తో పాటు BSNL తన రూ.699 ప్రమోషనల్ ప్లాన్ వాలిడిటీని 90 రోజుల పాటు పొడిగించింది. టెల్కో ఈ ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 180 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ సెప్టెంబర్ 28 తో ముగుస్తుంది. కానీ టెల్కో దీనిని మరో 90 రోజులు పొడిగించింది. రూ.699 ప్రమోషనల్ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు రోజుకు 0.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రోమో ప్లాన్ జనవరి 2022 వరకు చెల్లుతుంది.

ప్రోమో ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రోమో ప్రీపెయిడ్ ప్లాన్ పొందడానికి వినియోగదారులు రిటైల్ షాపులను సందర్శించాలి. అలాగే PLAN BSNL699 గా 123 కి SMS పంపడం ద్వారా కూడా ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు USSD షార్ట్ కోడ్ *444 *699# డయల్ చేయవచ్చు. BSNL రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న మరియు కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంది.

BSNL - గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్

BSNL - గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్

BSNL తెలంగాణ సర్కిల్ ద్వారా ఈ కొత్త ఆఫర్ ప్రారంభించబడింది. BSNL కొన్ని వారాల క్రితం తన బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ కొత్త పేమెంట్ పోర్టల్ కింద BSNL చందాదారులు వారు DSL లైన్, FTTH లేదా ఎయిర్ ఫైబర్‌ వంటి అన్ని రకాల పేమెంట్ లను తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేదా ఇతర పేమెంట్ ఎంపికలతో ముందుగానే వారి బిల్లులకు పేమెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థను మరింత దృఢమైన రీతిలో స్వీకరించాలని వినియోగదారులను కోరడానికి BSNL తన చందాదారుల కోసం ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
BSNL 4G SIM Cards Available Free Of Cost Up to December 2021: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X