BSNL 4G VoLTE లభ్యత ప్రైవేట్ టెల్కోలకు పోటీగా మరిన్ని నగరాలకు పెరిగింది!

|

ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన యూజర్ బేస్ ను పెంచుకోవడం కోసం 4G నెట్‌వర్క్ ను ఇండియా అంతటా ఈ సంవత్సరంలో ప్రారంభించటానికి సన్నద్ధమవుతోంది. ఏదేమైనా ప్రభుత్వ టెల్కో ఇప్పటికే భారతదేశంలోని ఎంచుకున్న కొన్ని నగరాల్లోని వినియోగదారులకు తన 4G VoLTE సేవలను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్ సేవలను గత సంవత్సరంమే కోయంబత్తూరులోని సౌత్ జోన్‌లో ప్రారంభించింది. ఈ VoLTE సేవలు తరువాత మరిన్ని నగరాలకు విస్తరించబడింది. ప్రస్తుతం ఇండియాలో BSNL 4G యొక్క VoLTE సేవలు అందుబాటులో ఉన్న సర్కిల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL 4G VoLTE సేవలు అందుబాటులో గల నగరాలు

BSNL 4G VoLTE సేవలు అందుబాటులో గల నగరాలు

గత సంవత్సరం మొదటిసారిగా కోయంబత్తూరులోని సౌత్ జోన్ లో బిఎస్ఎన్ఎల్ యొక్క 4G VoLTE సేవలు మొదలయి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్‌గ్రేడ్ ప్రోటోకాల్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు తరువాత చెన్నై, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మరియు కర్ణాటకతో సహా మరిన్ని నగరాలకు విస్తరించబడ్డాయి.

VoLTE

VoLTE సేవలు అందుబాటులో గల ప్రాంతంలోని వినియోగదారులు అధిక-నాణ్యతతో వాయిస్ కాలింగ్‌ను అనుభవించడానికి అనుమతిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులకు లభించిన అధిక డేటాతో వీడియో మరియు వాయిస్ కాల్స్ రెండింటినీ చేయడానికి వీలును కల్పిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క VoLTE జాబితాలో మరిన్ని కొత్త నగరాలను చేర్చుతోంది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క 4G సిమ్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులు తమ ఫోన్ లో VoLTE సర్వీసును యాక్టివేట్ చేయడానికి ఒక అభ్యర్థనను పంపాలి. మొదటగా వినియోగదారులు 4G VoLTE ను కలిగి ఉన్న హ్యాండ్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి. తరువాత "ACT VOLTE" అని టైప్ చేసి 53733 కు SMS ను పంపాలి. ఈ అభ్యర్థనను పంపిన తరువాత సంస్థ వినియోగదారుడి కోసం VoLTE సర్వీసులను కొద్ది నిమిషాలలోనే యాక్టివేట్ చేస్తుంది.

BSNL VoLTE

BSNL యొక్క ప్రస్తుత వినియోగదారులు సంస్థ యొక్క 2G లేదా 3G సిమ్ కార్డును ఉపయోగిస్తుంటే కనుక వారి స్మార్ట్‌ఫోన్‌లలో VoLTE సర్వీసును ప్రభావితం చేయలేరు. కావున కొత్త 4G సిమ్ కార్డును పొందడానికి వినియోగదారులు తమ సమీప బిఎస్ఎన్ఎల్ రిటైల్ దుకాణాన్ని సందర్శించి కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కేవలం 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

BSNL హైబ్రిడ్ 4G ప్రణాళిక

BSNL హైబ్రిడ్ 4G ప్రణాళిక

భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ తన 4G సేవలను అందించడానికి సాంప్రదాయ మార్గాన్ని కాకుండా ఒక హైబ్రిడ్ 4G ప్రణాళికను ప్రతిపాదించింది. ఇందులో భారతీయ యూజర్ల కోసం 50,000 సైట్లు మరియు ప్రపంచ అమ్మకందారుల కోసం మిగిలిన 57,000 సైట్లు రిజర్వు చేయబడతాయి. టెల్కో ప్రకారం భారతీయ విక్రేతలు సకాలంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC) ను ఉత్పత్తి చేయగలిగితే కనుక వారు కూడా విదేశీ కంపెనీల కోసం రిజర్వు చేసిన 57,000 సైట్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL 4G VoLTE Availability Increased to More Circles to Compete With Private Telcos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X