Home
News

కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటి వద్దకు BSNL 5G సిమ్.... ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ఎలాగో తెలుసుకోండి..

BSNL 5G SIM Delivery: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. మీరు 5G సిమ్ కార్డ్ కావాలంటే బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు, కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటికే సిమ్ డెలివరీ అవుతుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల ధరలు పెంచుతున్నాయి.

ఈ తరుణంలో, BSNL సేవలను వేగంగా, సులభంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఇంటి వద్దకే సిమ్ డెలివరీ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా, BSNL కస్టమర్ సేవలో ఒక అడుగు ముందుకేసి, టెలికాం మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది.

BSNL 5G SIM Online Order

* BSNL మళ్లీ ఎందుకు పాపులర్ అవుతోంది..

జియో, ఎయిర్‌టెల్, Vi లాంటి ప్రైవేట్ కంపెనీలు మొబైల్ ప్లాన్ల రేట్లను పెంచడంతో, చాలా మంది వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మంచి సేవలు అందించే ఆప్షన్ల కోసం చూస్తున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కావడంతో, BSNL చాలా మందికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

ఉదాహరణకు 2024, జులైలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 2.17 లక్షల మంది కొత్త కస్టమర్లు BSNLలో చేరారు. ఈ డిమాండ్ పెరగడంతో BSNL ఆఫీసుల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఇబ్బందిని గమనించిన BSNL, కస్టమర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సులభంగా, వేగంగా సిమ్ పొందే ఆన్‌లైన్‌ ప్రాసెస్ తీసుకొచ్చింది.

* BSNL 5G విస్తరణ, భవిష్యత్ ప్రణాళికలు

దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, ఇంటి వద్దకే డెలివరీ, అక్కడే KYC పూర్తి చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న 4G నెట్‌వర్క్‌తోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో BSNL కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

అక్టోబర్ నాటికి 80,000 టవర్లను, మరికొంత కాలం నాటికి ఏకంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల, యూజర్లు తమ ఫోన్లలో పెద్దగా హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే హై-స్పీడ్ 5జీ ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

* ఆన్‌లైన్‌లో BSNL 5జీ సిమ్ ఆర్డర్ చేయడమెలా

BSNL తన 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్న కొద్దీ, యూజర్లకు మెరుగైన కవరేజ్, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. BSNL సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం చాలా సులభం. కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.

ముందుగా https://prune.co.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ కనిపించే "బై సిమ్‌ కార్డు (Buy SIM Card)" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ దేశంగా 'India'ను ఎంచుకోవాలి. ఆపరేటర్ల లిస్టులో 'BSNL'ను సెలెక్ట్ చేసుకోవాలి. కావాల్సిన మొదటి రీఛార్జ్ కూపన్ (FRC) ప్లాన్‌ను ఎంచుకోవాలి. పేరు, తదితర వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నింపాలి.

మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో నంబర్‌ను వెరిఫై చేయాలి. సిమ్ డెలివరీ కోసం మీ పూర్తి చిరునామాను ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేశాక, కేవలం 90 నిమిషాల్లోనే మీ BSNL సిమ్ కార్డ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. డెలివరీ చేసే వ్యక్తి మీ ఇంటి వద్దనే KYC ప్రక్రియను, సిమ్ యాక్టివేషన్‌ను కూడా వెంటనే పూర్తి చేస్తారు.

* BSNL యూజర్లకు అదనపు ప్రయోజనం..

BSNL తన కస్టమర్ల కోసం BiTV అనే మరో సదుపాయాన్ని కూడా పరిచయం చేసింది. దీని ద్వారా ఏకంగా 450కి పైగా టీవీ ఛానళ్లను ఉచితంగా చూడవచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ ఇప్పుడు అన్ని BSNL రీఛార్జ్ ప్లాన్లతో పాటే వస్తుంది. అంటే, టీవీ చూడటానికి ప్రత్యేకంగా DTH సేవలకు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

మొబైల్ ప్లాన్‌తో పాటు ఎక్కువ విలువను కోరుకునే వారిని ఆకట్టుకోవడానికి BSNL వేసిన మంచి అడుగు ఇది. రాబోయే నెలల్లో మిగతా టెలికాం కంపెనీల మొబైల్ ప్లాన్ల ధరలు మరో 10 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, BSNL అందిస్తున్న తక్కువ ధర ప్లాన్లు, వేగంగా విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్, ఇంటి వద్దకే వేగంగా సిమ్ డెలివరీ, BiTV వంటి ఉచిత అదనపు సేవలు BSNL ను ఒక మంచి ఎంపికగా నిలుపుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL 5G SIM Online Order, Get Doorstep Delivery in Just 90 Minutes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X