Home
News

BSNL 5G టెస్టింగ్ జరుగుతోంది! లాంచ్ ఎప్పుడంటే? వివరాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 5G ని పరీక్షిస్తోంది అని మీకు ఇప్పటికే సమాచారం తెలుసు, అయితే ఇప్పుడు భారత టెలికాం సంస్థ DOT ఈ విషయం ఖరారు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1 లక్ష సైట్‌లలో 4Gని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ టెలికాం ఆపరేటర్‌కు బాధ్యతలు అప్పగించారు.

BSNL ని వీలైనంత త్వరగా లాభదాయకమైన కంపెనీగా మార్చాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది. 4G ని విడుదల చేస్తున్న ఏ కంపెనీకైనా 5G అనేది సహజమైన పురోగతి. BSNL యొక్క 4G రోల్‌అవుట్ చాలా సంవత్సరాలు ఆలస్యం అయినందున, ఇప్పుడు 5G లో ఎక్కువగా ఆలస్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

BSNL 5G Testing In Progress

BSNL సంస్థ ఇప్పటికే 5Gని పరీక్షిస్తోంది. ఈ పరీక్షను BSNL మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (C-DoT) నిర్వహిస్తున్నాయి. C-DoT 4Gకి కూడా నెట్‌వర్క్ కోర్‌ని అందిస్తోంది. 4G మరియు 5G రెండింటికీ ఒకే కోర్ ఉపయోగించవచ్చు. దీనికి కనీస అప్డేట్ లు అవసరం అవుతాయి. అని BSNL మరియు C-DoT పరీక్షిస్తున్నాయి.

IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2024 సందర్భంగా BSNL నుండి 5G యొక్క ఏదైనా సమాచారం మనం చూడగలిగితే అది ఆసక్తికరంగా ఉంటుంది.

జియో తర్వాత భారత వినియోగదారులకు 5G అందించడానికి స్వదేశీయ నెట్‌వర్క్ కోర్‌ను ఉపయోగిస్తున్న రెండవ కంపెనీ BSNL. ఈ నెట్‌వర్క్ గేర్ మరియు కోర్ వంటి ప్రధాన సేల్ ల నుండి కొనుగోలు చేసినట్లయితే దానితో పోలిస్తే తక్కువ ధరతో 4G మరియు 5Gలను అందుబాటులోకి తీసుకురావడానికి అదే కోర్ ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు కాబట్టి ఇది భారతదేశానికి చాలా గొప్పగా ఉంటుంది. నోకియా, ఎరిక్సన్ మరియు మరిన్ని వాటితో పోటీ పడుతోంది.

BSNL సంస్థ 2025 ప్రారంభంలో 5G ని లాంచ్ చేస్తుందని కొందరు అధికారులు సూచించారు. ఇది కంపెనీకి మంచి పరిణామం, అయితే భారతదేశంలో వాణిజ్యపరంగా విజయవంతమైన నెట్‌వర్క్ గా 4G అవుతుంది. నిదానంగా 5G రోల్‌అవుట్ ఎటువంటి హాని చేయనప్పటికీ, మొదట BSNL 4Gపై దృష్టి పెట్టాలి. ఇక్కడే టెల్కోకి డబ్బు మరియు భారీ కస్టమర్ బేస్ ఏర్పడుతుంది.

భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన BSNL తన తాజా ప్రకటనలో, కొత్త BSNL లైవ్ టీవీ యాప్‌ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా లాంచ్ చేయబడింది. మరియు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
BSNL 5G Testing In Progress, Expected To Launch In Early 2025 DOT Confirms. More Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X