ఆ సంస్థల నిర్ణయం BSNL కు బాగా కలిసివచ్చింది.. జులై, ఆగస్టు నెల నివేదికలు ఏం చెబుతున్నాయి..?
ప్రైవేటు టెలికాం సంస్థలు ఈ సంవత్సరం జులై నెలలో భారీగా మొబైల్ టారిఫ్ ధరలను పెంచాయి. ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు కలిగి వచ్చింది. ప్రస్తుతం తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న BSNL వైపు అధిక సంఖ్యలో యూజర్లు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్- ఐడియా సంస్థలకు యూజర్లు భారీ షాక్ ఇస్తు్న్నారు. జులై నెలలో భారీగా BSNL కు పోర్టింగ్ మరియు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేశారు.
అయితే తాజాగా మరో నివేదిక వచ్చింది. జులై నెల తరహాలోనే ఆగస్టు నెలలోనూ BSNL నెట్‌వర్క్‌లోకి భారీ సంఖ్యలో (BSNL Gains Users in August 2024) యూజర్‌లు వచ్చారు. ఈ వివరాలను ట్రాయ్ (TRAI - టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఆగస్టు నెలలో BSNL నెట్‌వర్క్‌లోకి ఏకంగా 25 లక్షల మంది జాయిన్ అయ్యారు.

అదే సమయంలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్- ఐడియా (VI) భారీ సంఖ్యలో యూజర్‌లను కోల్పోయాయి. జియో సుమారు 40 లక్షలు, ఎయిర్‌టెల్ సుమారుగా 24 లక్షలు, వోడాఫోన్ ఐడియా సుమారుగా 19 లక్షల యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు వచ్చాయి.
జులై నెలలో BSNL సుమారుగా 29 లక్షలకు పైగా యూజర్‌లను సంపాదించింది. అదే నెలలో జియో 8 లక్షలను కోల్పోయింది. ఎయిర్‌టెల్ 17 లక్షలు, వోడాఫోన్ ఐడియా 14 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అయితే 5G నెట్‌వర్క్‌లో జియో గతంతో పోలిస్తే యూజర్‌ల సంఖ్యను పెంచుకోగలిగింది.
BSNL రెండు రోజుల క్రితం కొత్త లోగో విడుదల చేసింది దీంతోపాటు 7 కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇందులో ముఖ్యంగా స్పామ్ కాల్స్‌కు, మెసేజ్‌లకు చెక్ పెట్టే విధంగా స్పామ్ బ్లాకర్‌లను వినియోగించనున్నట్లు తెలిపింది. సిమ్ కియోస్కోలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. 24 గంటలపాటు కొత్త సిమ్ యాక్టివేషన్, KYC, పోర్టింగ్‌ను సులభంగా చేసుకోనేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు ఉంటాయి.
అయితే ఈ కార్యక్రమం అనంతరం BSNL CMD రాబర్ట్ రవి.. ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశారు. సమీప భవిష్యత్‌లో BSNL ఛార్జీలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీలు పెంచే అవసరం లేదన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు.
దీంతోపాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు BSNL కృషిచేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష 4G నెట్‌వర్క్ టవర్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్ నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది.
దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ను కూడా జూన్ 2025 నాటికి ప్రారంభించాలని భావిస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియా ఇటీవల వెల్లడించారు. C-DoT, టాటా భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ను సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








