ఆగస్టులో ఫుల్ జోష్‌లో BSNL.. ఏకంగా 13 లక్షలకు పైగా కొత్త యూజర్లు..!
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల కీలక గణాంకాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన మొబైల్ యూజర్ల వివరాలను TRAI వెల్లడించింది. ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోతున్న ప్రభుత్వరంగ సంస్థ BSNL.. ఆగస్టులో పుంజుకుంది. ఏకంగా ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి, కొత్త యూజర్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది.
ట్రాయ్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఆగస్టు నెలలో జియో, BSNL, ఎయిర్‌టెల్ కొత్త యూజర్లను సంపాదించుకున్నాయి. మరో ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్ వోడాఫోన్ ఐడియా (Vi) భారీగా యూజర్లను కోల్పోయింది. ఇటీవల కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ భారీగా యూజర్లను కోల్పోతుండగా.. ఆగస్టు నెలలో మాత్రం భారీగా కొత్త యూజర్లను ఆకర్షించింది.

BSNL జోష్ :
ట్రాయ్ వివరాల ఆధారంగా ఆగస్టు 2025 నెలలో జియో నెట్‌వర్క్‌లో కొత్తగా 19 లక్షల యూజర్లు చేరారు. రెండో స్థానంలో BSNL నిలిచింది. ఏకంగా 13.85 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది. మరో సంస్థ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 4.96 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు.
ఈ నెట్‌వర్క్‌కు షాక్! :
మరో ప్రైవేటు నెట్‌వర్క్ వోడాఫోన్ ఐడియా ఆగస్టు నెలలో ఏకంగా సుమారు 3.08 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. తాజా లెక్కల ఆధారంగా దేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 122.45 కోట్లకు చేరింది. జులై ఈ సంఖ్య 122 కోట్లుగా ఉండేది. అంటే ఆగస్టు నెలలో ఏకంగా 35.19 లక్షల మంది కొత్తగా కనెక్షన్‌లు తీసుకున్నారు.
ఇవే కారణాలా? :
BSNL తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. కొత్త యూజర్ల చేరికకు కారణం కావచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వ తేదీ వరకు ఆజాదీ కా ప్లాన్ పేరిట ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1 కే రీఛార్జ్ ప్లాన్‌ను అందించింది. అయితే కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫర్ అందించింది.
ఈ ప్లాన్‌లో భాగంగా కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారికి కేవలం రూ.1 కే 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలను అందించింది. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను కూడా అందించింది. ఈ ఆఫర్ బీఎస్ఎన్‌ఎల్ యూజర్ల పెరుగుదలకు కారణంగా కావచ్చు.
* సెప్టెంబర్ చివరి వారంలో BSNL 4G నెట్‌వర్క్ ప్రారంభం అయింది. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 97,500 మొబైల్ టవర్లను ప్రారంభించారు. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోనూ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే 4G నెట్‌వర్క్ ప్రారంభంపై ముందస్తు ప్రకటనలు కూడా యూజర్ల పెరుగుదలకు కారణం కావచ్చు.
* BSNL ఇటీవల తన కస్టమర్‌ల కోసం VoWiFI వాయిస్ సర్వీస్‌ను ప్రారంభించింది. దీంతో మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా.. వైఫై కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో VoWiFi ఫీచర్ ఉండాలి. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో నెట్సింగ్స్‌లో ఈ ఫీచర్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకొని, ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








