Home
News

ఇక "సిగ్నల్‌ లేదు" అనే మాటే వినిపించదు.. ఈ మూడు నెట్‌వర్క్‌ల యూజర్‌లకు పండగే..!

భారత్‌లో టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఇటీవల కాలంలో భారీ మార్పులు వస్తున్నాయి. నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌లతోపాటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కృషిచేస్తోంది. దీంతో మారుమాల గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. మరియు హైస్పీడ్‌ ఇంటర్నె్ట్‌ ను అధిక శాతం ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ BSNL సహా ఇతర సంస్థలు కూడా మెరుగైన నెట్‌వర్క్‌ కవరేజీ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

BSNL 4G నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా లక్ష టవర్ల నిర్మాణం చేపడుతోంది. ఈ సంవత్సరం మే నాటికి వీటిని పూర్తిగా వినియోగంలోనికి తీసుకురావాలని భావిస్తోంది. డిసెంబర్‌ నాటికి 60 వేలకు పైగా టవర్లను పూర్తి చేసింది. పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ 4G నెట్‌వర్క్‌ ను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది.

digital bharat nidhi

అయితే తాజాగా మొబైల్‌ యూజర్లు టెలికాం శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెట్‌వర్క్ లేకపోయినా కూడా కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఉదాహరణకు BSNL ను ఉపయోగిస్తుంటే.. మీరున్న ప్రాంతంలో ఏదైనా సమయంలో సిగ్నల్‌ లేకుంటే.. అక్కడే ఉన్న ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌ టవర్ల ద్వారా మీరు కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

వీరికి ప్రయోజనం : కొత్త టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యం కానుంది. టెలికాం శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఇటీవల డిజిటల్‌ భారత్‌ నిధిలో (DBN) భాగంగా ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ (ICR) ను లాంచ్‌ చేశారు. దీని ద్వారా BSNL, ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ కొత్త విధానంతో (Intra Circle Roaming) యూజర్లతోపాటు నెట్‌వర్క్‌ సంస్థలు కూడా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో BSNL, ఎయిర్‌టెల్‌, జియో టవర్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇలా ప్రతిచోటా వేర్వేరుగా టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.

35,400 పైగా గ్రామీణ ప్రాంతాల్లో : అదే సమయంలో యూజర్లు కూడా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ ‌ద్వారా 4G సర్వీసులను వినియోగించుకోవచ్చు. డిజిటల్‌ భారత్‌ నిధిలో భాగంగా సుమారు 27,000 టవర్లను ఉపయోగించి.. 35,400 పైగా గ్రామీణ ప్రాంతాల్లో 4G కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

యూనివర్సల్‌ సర్వీస్ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (USOF) నే ప్రస్తుతం డిజిటల్‌ భారత్ నిధి (DBN) గా పిలుస్తున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం నిధులు సమకూర్చడం సహా కనెక్టివిటీని మెరుగుపరచడంలో DBN కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టవర్లతో మాత్రమే కొత్త సేవలను పొందవచ్చు.

గతంలో పోలిస్తే టెలికాం వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు టెలికాం సంస్థలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మెరుగైన నెట్‌వర్క్‌ ను అందిస్తుండగా.. BSNL (భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంవత్సరం మే నెల నాటికి 4G ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడం సహా జూన్‌ నుంచి 5G సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL airtel and jio to share networks under digital bharat nidhi funded locations
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X