అక్టోబర్ 2021లో BSNL, Airtel టెల్కోల బెస్ట్ 4G డేటా ప్లాన్‌లు ఇవే!!

|

భారతదేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం బ్రాండ్‌లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరియు భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. ఈ రెండు కంపెనీలు తమ వినియోగదారులకు 4G డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. BSNL కి పాన్ ఇండియా 4G నెట్‌వర్క్‌లు లేనప్పటికీ అది అందించే వోచర్లు/ప్లాన్‌లు 4G నెట్‌వర్క్‌ల కింద కూడా పనిచేస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో టెల్కో 4G నెట్‌వర్క్‌లను కలిగి ఉండటం గమనార్హం. కావున 4G డేటా ప్లాన్‌లు BSNL యొక్క 4G నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయిన చాలా మందికి ఉపయోగకారముగా ఉంటాయి. అక్టోబర్ 2021 లో మీకు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉన్న BSNL మరియు Airtel యొక్క 4G డేటా ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL బెస్ట్ 4G డేటా ప్లాన్‌లు

BSNL బెస్ట్ 4G డేటా ప్లాన్‌లు

BSNL టెల్కో తన యొక్క వినియోగదారులకు అనేక 4G డేటా ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో మీరు సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ప్రముఖముగా ఉన్నవి Mini_16, C_DATA56, STV97, Data_WFH_151, Data_WFH_251, మరియు TrulyUnlimitedSTV_398. ఇందులో మొదటగా Mini_16 4G డేటా వోచర్ రూ.16 ధర వద్ద 1రోజు చెల్లుబాటుతో వినియోగదారులకు 2GB డేటాను అందిస్తుంది. రెండవది C-DATA56 వోచర్ రూ.56 ధర వద్ద 10 రోజుల వాలిడితో జింగ్ మ్యూజిక్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా 10GB డేటాను అందిస్తుంది.

బ్లూటూత్ కాలింగ్ సపోర్టుతో లభించే స్మార్ట్‌వాచ్‌లు వాటి పూర్తి వివరాలు...బ్లూటూత్ కాలింగ్ సపోర్టుతో లభించే స్మార్ట్‌వాచ్‌లు వాటి పూర్తి వివరాలు...

BSNL
 

BSNL టెల్కో నుండి వచ్చే STV_97 ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 2GB రోజువారీ డేటా, 100 SMS/రోజు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ + లోక్‌ధుమ్ కంటెంట్‌ను అందిస్తుంది. 'Data_WFH_151' మరియు 'Data_WFH_251' తో సహా తదుపరి రెండు వోచర్‌లు రెండూ హోమ్ డేటా వోచర్‌ల నుండి పని చేస్తాయి. ఈ వోచర్‌లు రూ.151 మరియు రూ.251 ధరలతో లభిస్తాయి. అయితే ఈ రెండూ 28 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. BSNL యొక్క రూ.151 4G డేటా వోచర్ ఉచిత జింగ్‌తో 40GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.251 వోచర్ 70GB డేటాను ఉచిత జింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది.

JioPhone next స్పెసిఫికేషన్లు మరియు లాంచ్ డేట్ లీక్ అయ్యాయి ! వివరాలుJioPhone next స్పెసిఫికేషన్లు మరియు లాంచ్ డేట్ లీక్ అయ్యాయి ! వివరాలు

TrulyUnlimitedSTV_398

చివరగా 'TrulyUnlimitedSTV_398' అనేది ఒక ప్రత్యేక ప్లాన్ ఎందుకంటే ఇది వినియోగదారులకు ఎలాంటి ఫెయిర్ యూజ్-పాలసీ (FUP) పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు పొందుతారు. BSNL నుండి రూ.398 వోచర్ యొక్క చెల్లుబాటు 35 రోజులు.

భారతీ ఎయిర్‌టెల్ 4G డేటా ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ 4G డేటా ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ కూడా తన యొక్క వినియోగదారులకు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇవి డేటాను మాత్రమే అందిస్తాయి. వీటిలో భాగంగా రూ.48, రూ.89, రూ.98, మరియు రూ.251 ధరల వద్ద లభించే డేటా వోచర్‌లు లభిస్తాయి. ఈ ధరల విభాగంలో ఎయిర్‌టెల్ డేటా వోచర్‌లను అందిస్తుంది. రూ.48 ధర వద్ద లభించే డేటా ప్లాన్‌తో ఎయిర్‌టెల్ 3GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.89, రూ.98 మరియు రూ.251 ధరల వద్ద లభించే డేటా వోచర్‌లతో టెల్కో వరుసగా 6GB, 12GB మరియు 50GB 4G డేటాను అందిస్తుంది. అయితే 89 రూపాయల ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. పైన పేర్కొన్న అన్ని భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క చెల్లుబాటు వినియోగదారుడి ప్రస్తుత అపరిమిత ప్లాన్ యొక్క చెల్లుబాటుతో సమానంగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL, Airtel Telcos Provide Best 4G Data Plans For More Data in October 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X