Home
News

5G స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం నుండి స్వీకరించనున్న BSNL మరియు MTNL ...

ప్రభుత్వ టెలికాం సంస్థలు బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ పరిపాలనాపరంగా ప్రభుత్వం నుండి 5G స్పెక్ట్రంను అందుకోనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ వార్తను పార్లమెంటుకు తెలియజేశారు. అంటే దీని అర్థం ఈ టెల్కోలు వేలంలో పాల్గొనవలసిన అవసరం లేకుండానే 5G సేవలను పొందవచ్చు. దేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ 4G సేవలను ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే దానిపై సరైన అప్ డేట్ లేనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే 5G సేవల గురించి మాట్లాడుతోంది. అయితే 4G స్పెక్ట్రం కేటాయింపుకు ఉపయోగించే అదే సూత్రంపై 5G స్పెక్ట్రం కేటాయింపు కూడా జరుగుతుందని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. రాబోయే నెలల్లో బిఎస్‌ఎన్‌ఎల్ లక్ష 4G నోడ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రత్యేక సమాచారంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంజయ్ ధోత్రే లోక్‌సభకు తెలిపారు.

5G ఎయిర్‌వేవ్స్‌ వేలం

5G ఎయిర్‌వేవ్స్‌ వేలం

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభకు రాతపూర్వకంగా అందించిన లేఖలోని సమాచారం ప్రకారం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరిపాలనచేయడం కోసం 5G సేవలను కేటాయించే మరియు రూపొందించడానికి అవసరమైన స్పెక్ట్రం యొక్క ప్లాన్ ను ప్రభుత్వం ఆమోదించింది. భారతదేశంలో 5G సేవలను ప్రారంభించడానికి మేము ఇంకా నెలల దూరంలో ఉన్నాము. 2021 స్పెక్ట్రమ్ వేలం ఈ నెల ప్రారంభంలో పూర్తయింది. ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో 5G ఎయిర్‌వేవ్స్‌ను వేలం వేయాలని భావిస్తున్నారు. 2021-22లో 4G ఎయిర్‌వేవ్స్‌ను కొనుగోలు చేయడానికి రూ.24,084 కోట్లు కేటాయించినట్లు మంత్రి ధృవీకరించారు. ఈ నిధులతో టెల్కో ఈ ఏడాది 4G సేవలను అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 4G టెండర్ను ఖరారు చేసే పనిలో ఉంది.

BSNL 5G రోల్‌అవుట్‌

BSNL 5G రోల్‌అవుట్‌

భారతదేశంలో 5G రోల్‌అవుట్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ఎలా తీసుకురానున్నది అన్న దాని మీద అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యాజమాన్యంలోని PSU ఈ ఏడాది చివరి నాటికి 4G సేవలను అందుబాటులోకి తెస్తుందని విస్తృతంగా భావిస్తున్నారు. తర్వాత అవసరమైన స్పెక్ట్రం అందుకున్న తర్వాత 5G కి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదనంగా బిఎస్ఎన్ఎల్ 5G స్పెక్ట్రంను ప్రభుత్వం నుండి పొందటానికి చివరి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే 5G బ్యాండ్లలో స్పెక్ట్రం పొందటానికి ప్రైవేట్ టెల్కోస్ వేలంలో పాల్గొంటాయి.

BSNL & MTNL

బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టిఎన్‌ఎల్‌ల విలీనాన్ని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అయితే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఏప్రిల్ 1 నుండి మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) యొక్క మొబైల్ సేవలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి ఈ రోజు రాజ్యసభకు తెలియజేశారు. బిఎస్‌ఎన్‌ఎల్ 20 సర్కిల్‌లలో మొబైల్ సేవలను నిర్వహిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL and MTNL Will Receive 5G Spectrum From The Government
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X