BSNL, Vi విలీనం సాధ్యమేనా? ఇందులో ఎంత నిజముంది...

|

భారతదేశంలో టెలికాం రంగంలో తన యొక్క వ్యాపారాన్ని నిర్వహించడానికి దశాబ్దానికి పైగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కష్టపడుతోంది. అదే సమయంలో వోడాఫోన్ మరియు ఐడియా యొక్క విలీన సంస్థ - Vi భారతదేశ టెలికాం పరిశ్రమలోని గట్టి పోటీలో తేలుతూ ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఇండియాలోని టెలికాం ఆపరేటర్‌లలో రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్‌ ఆపరేటర్‌లు మాత్రమే లాభదాయకంగా ఉన్నారు. స్పష్టంగా చెప్పాలంటే చాలా మంది కాదు! టెల్కో పోస్ట్ ఈక్విటీ మార్పిడిలో ప్రభుత్వం మరియు కేంద్రం అత్యధిక వాటాను కలిగి ఉండే అవకాశం ఉన్న కారణంగా స్టాచ్యూరీ డెట్‌ను ఈక్విటీగా మార్చడాన్ని వోడాఫోన్ ఐడియా బోర్డు అంగీకరించడంతో BSNL మరియు Vodafone Idea విలీనానికి స్థలం ఉందా? అని మార్కెట్ లో కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL- vi

నష్టాల్లో ఉన్న ఆస్తుల నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎయిర్ ఇండియా దీనికి ఒక క్లాసిక్ మరియు బలమైన ఉదాహరణ. వోడాఫోన్ ఐడియా మరియు BSNLలను విలీనం చేసి దానిని మరొక ప్రైవేట్ గ్రూప్‌కు విలీన సంస్థగా విక్రయించే ఉద్దేశ్యం ఉండవచ్చు. అంతకుముందు కుమార్ మంగళం బిర్లా ఇప్పటికే వోడాఫోన్ ఐడియాలో తన వాటాను ప్రభుత్వానికి విక్రయించే ఉద్దేశాన్ని పంచుకున్నారు. కానీ ప్రభుత్వం దానిపై ఆసక్తి చూపలేదు. Vi తన భుజాలపై అప్పుల పర్వతాన్ని పోగు చేసుకున్నందున ఇది ప్రభుత్వానికి మంచి ఒప్పందం కాదు. నష్టాల్లో ఉన్న ఒక టెల్కో నుండి రెండు నష్టాల్లో ఉన్న టెల్కోలకు అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం ఇష్టపడదు.

ప్రభుత్వానికి

రెండు టెల్కోలను కలిపి నడపాలని ప్రయత్నిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా చితికిపోతుంది. అయితే దీనికి గల ప్రత్యామ్నాయం ఏమిటంటే ప్రభుత్వం రెండు సంస్థలను విలీనం చేసి కొత్త కొనుగోలుదారుకు ప్యాకేజీగా అందించడం. కొత్త కొనుగోలుదారుల కోసం వెతుకుతున్న BSNL మరియు Vodafone Idea వ్యాపారాలను ప్రభుత్వం మిళితం చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇది లాంగ్-షాట్ అయినప్పటికీ ఇది ఖచ్చితంగా వినియోగదారుల మనస్సులలో నడిచే విషయం అని J సాగర్ అసోసియేట్స్ (JSA) భాగస్వామి టోనీ వర్గీస్ తెలిపారు.

BSNL 90 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్
 

BSNL 90 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో రూ.2399 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 90 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 3GB రోజువారీ డేటా వంటి ప్రయోజనాలతో అందిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. కానీ ప్రస్తుత ఆఫర్ విభాగంలో వినియోగదారులు ఈ ప్లాన్‌తో 90 రోజుల అదనపు వాలిడిటీని కూడా పొందుతారు. మొత్తంగా దీని యొక్క సర్వీస్ వాలిడిటీని 455 రోజులుగా ఉంది. నెలల విభాగంలో చూస్తే ఇది దాదాపు 15 నెలలుగా ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) వార్షిక ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) వార్షిక ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కూడా తన వినియోగదారులకు సంవత్సరం వాలిడిటీతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు రిలయన్స్ జియోతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. జాబితాలోని మొదటి ప్లాన్ సరసమైనది కానీ తక్కువ డేటా ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ ప్లాన్ రూ.1,799 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఇది అపరిమిత కాల్‌లతో పాటు మొత్తం 24GB డేటాను మరియు మొత్తం 3600 SMSలను అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధి 365 రోజులు మరియు ఈ ప్లాన్ Vi Movies మరియు TVకి యాక్సెస్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL and Vodafone Idea(Vi) Telcos Merge Possible Right Now?: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X