BSNL పాన్-ఇండియా STV1,498 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ విడుదలైంది!!

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో పాన్-ఇండియా ప్రాతిపదికన రూ.1500 ధరలోపు వినియోగదారుల కోసం కొత్తగా ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV) ని విడుదల చేసింది. STV 1,498 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 1 సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. ఈ STV యొక్క ప్రత్యేక విషయం అది అందించే ప్రయోజనాలు. వినియోగదారులు ఈ వోచర్‌తో 2GB రోజువారీ డేటాను పొందుతారు మరియు ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbps కి పడిపోతుంది.

STV ప్లాన్

సంవత్సరం దీర్ఘకాల చెల్లుబాటుతో పాటు చౌకైన ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ వోచర్ సరైనది. ముఖ్యంగా విద్యార్థులు మరియు ఇంటి నుండి పని చేసే వ్యక్తులు తమ యొక్క అన్ని రకాల పనులను పూర్తి చేయడానికి ఈ వోచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త STV ప్లాన్ ఆగష్టు 23, 2021 నుండి భారతదేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

11,250 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డ ఐఫోన్ X ఫోన్ ఏమయిందో తెలుసా??11,250 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డ ఐఫోన్ X ఫోన్ ఏమయిందో తెలుసా??

BSNL రూ.2,399 ప్లాన్‌లో మార్పులు

BSNL రూ.2,399 ప్లాన్‌లో మార్పులు

వినియోగదారులకు మొదటగా 365 రోజుల చెల్లుబాటును అందించే రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 425 రోజుల వాలిడిటీతో వస్తుంది అంటే 60 రోజులు ఎక్కువ. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 21 నుండి నవంబర్ 19 మధ్య రీఛార్జ్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా వినియోగదారులకు ఇరోస్ నౌ మరియు BSNL ట్యూన్స్ యొక్క అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

BSNL రూ.1,999 ప్లాన్‌లో మార్పులు
 

BSNL రూ.1,999 ప్లాన్‌లో మార్పులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెల్కో మార్పులు చేసిన వాటిలో రూ.1,999 ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100GB అదనపు డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా లోక్‌ధన్ కంటెంట్ మరియు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ కంపెనీ ఈ ప్లాన్‌తో 500GB సాధారణ డేటాను అందించేది కానీ ఇప్పుడు అది మొత్తంగా 600GB డేటాను అందిస్తుంది. అయితే FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు డేటాను 80 Kbps వేగంతో బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది.

మార్కెట్‌

రూ.1,999 ధర వద్ద లభించే ఈ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలు ఆగష్టు 23, 2021 నుండి భారతదేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయోజనాలు టెల్కో యొక్క ప్రస్తుత మరియు కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇవి కంపెనీ నుండి నిజంగా వినూత్నమైన ఆఫర్లు. కానీ అవి మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కారణం దేశం అంతటా మెరుగైన 4G నెట్ వర్క్ లేకపోవడమే.

Best Mobiles in India

English summary
BSNL Announced STV 1,498 PAN-India Prepaid Plan: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X