జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

|

క్రిస్‌మస్ మరియు న్యూ ఇయర్స్ 2020 సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ సరి కొత్త ఆఫర్లను ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని PSU రూ.1,999ల వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ యొక్క చెల్లుబాటును మరో 60 రోజులపాటు పెంచింది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం రీఛార్జ్ చేసిన తేదీ నుండి 425 రోజులపాటు ఉంటుంది.

బిఎస్ఎన్ఎల్
 

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,999 ప్లాన్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మరియు బిఎస్ఎన్ఎల్ టివి చందాలను కూడా ఉచితంగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది. రూ.1,999 ప్లాన్‌పై వాలిడిటీ ఎక్స్‌టెన్షన్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్ ఇతర టాక్‌టైమ్ రీఛార్జీలను కూడా ప్రవేశపెట్టింది.

జియో "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌" వివరాలు

టాక్‌టైమ్ రీఛార్జీ

కొత్తగా మొదలుపెట్టిన టాక్‌టైమ్ రీఛార్జీలలో రూ.450, రూ.250 ప్లాన్‌లు అదనపు టాక్ టైమ్ బెనిఫిట్‌తో వస్తాయి. రూ.97 ప్రీపెయిడ్ వోచర్‌ ప్లాన్‌కు కూడా బిఎస్‌ఎన్‌ఎల్ టివి చందాను కలుపుతున్నట్లు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ చివరకు ‘బిఎస్ఎన్ఎల్ టివి' అనే OTT యాప్ ను మొదలుపెట్టింది. ఇది యూజర్లను వీడియో ఆన్ డిమాండ్, సినిమాలు మొదలైనవి చూడటానికి అనుమతిస్తుంది. లోక్‌ధన్ టెలిమీడియా ప్రైవేట్ లిమిటెడ్ బీఎస్‌ఎన్‌ఎల్ టీవీ యాప్‌ను అభివృద్ధి చేసింది.

గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

పండుగ సందర్భ సమయంలో పరిమిత కాల ఆఫర్లను ప్రారంభించడానికి బిఎస్ఎన్ఎల్ ప్రసిద్ది చెందింది. ఈ సంవత్సరం కూడా ఈ పంథాను కొనసాగిస్తున్నది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇప్పుడు మరొక 60 రోజుల పాటు పొడిగించింది. అంటే ఈ ప్లాన్ ఇప్పుడు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 425 రోజుల కాలానికి అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందుకున్న షియోమి రెడ్‌మి K20

ప్రయోజనాలు
 

ప్రయోజనాలు

ఇంక ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3 జిబి డేటా మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మరియు బిఎస్ఎన్ఎల్ టివి చందాను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ చందాల యొక్క చెల్లుబాటు 365 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ 2019 డిసెంబర్ 25 నుండి 2020 జనవరి 31 వరకు అన్ని టెలికాం సర్కిల్‌లలో లభిస్తుంది.

యూట్యూబ్‌లో 2019 లో అధిక వ్యూస్‌లను సాధించిన వీడియోలు

అదనపు టాక్ టైమ్ బెనిఫిట్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్‌ ప్లాన్‌లు

అదనపు టాక్ టైమ్ బెనిఫిట్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్‌ ప్లాన్‌లు

రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై చెల్లుబాటును పొడిగించడంతో పాటు బిఎస్‌ఎన్‌ఎల్ రెండు ప్రీపెయిడ్ రీఛార్జీలను రూ.450, రూ.250లపై ఇప్పుడు అదనపు టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్లు ధృవీకరించింది. రూ.450 రీఛార్జ్ ప్లాన్‌పై ఇప్పుడు రూ.500 టాక్ టైంను పొందవచ్చు అలాగే రూ.250 ప్లాన్ మీద రూ.275 టాక్ టైమ్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ అదనపు టాక్ టైమ్ ఆఫర్ డిసెంబర్ 24, 2019 నుండి జనవరి 2, 2020 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా టెల్కో ప్రవేశపెట్టిన పరిమిత కాల ఆఫర్ మాత్రమే.

2020లో ఇండియాలో రిలీజ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.97 ప్రీపెయిడ్ వోచర్ ప్లాన్‌

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.97 ప్రీపెయిడ్ వోచర్ ప్లాన్‌

చివరగా బిఎస్ఎన్ఎల్ తన ముఖ్యమైన రూ.97 ప్రీపెయిడ్ వోచర్‌ను సవరించింది. రూ.97 ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న డేటా-ఓన్లీ ఆఫర్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఇది వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ టివి చందాను కూడా అందించడానికి దీనిని సవరించారు. ఈ ప్లాన్ యొక్క యాక్సిస్ తగ్గుతూనే ఉంది. ఇప్పుడు ఈ ప్లాన్ కేవలం 18 రోజుల చెల్లుబాటుతో మాత్రమే వస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ.97 ప్రీపెయిడ్ వోచర్ రోజుకు 250 నిమిషాలు ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాల్స్‌ను, రోజుకు 2 జిబి డేటా మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను 18 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అదనంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు మూడు వారాల మొత్తం చెల్లుబాటు కాలానికి ఉచిత బిఎస్ఎన్ఎల్ టివి చందాకు కూడా యాక్సిస్ ను పొందుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Announces Christmas and New Year Recharge Plans Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X