రూ.298కే 56 రోజులు అన్ని ఉచితం
56 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్/ఎస్‌టిడి, ఆన్‌నెట్, ఆఫ్‌నెట్)తో పాటు రోజుకు 1జీబి డేటా...
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, ప్రమోషనల్ ఆఫర్ క్రింద మరో ఫస్ట్ రీఛార్జ్ (ఎఫ్ఆర్‌సీ) ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. FRC 298 పేరుతో అందుబాటులో ఉండే ఈ ప్యాక్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరాలనుకునే కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

56 రోజుల పాటు అన్‌లిమిటెడ్...
బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో జాయిన్ అయిన కొత్త యూజర్లు ఈ ప్యాక్‌ను తీసుకున్నట్లయితే 56 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్/ఎస్‌టిడి, ఆన్‌నెట్, ఆఫ్‌నెట్)తో పాటు రోజుకు 1జీబి డేటా లభిస్తుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ 180 రోజులు (07/08/2017 నుంచి 04/11/2017) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

జియో రూ.399 ప్లాన్‌తో పోటీ...
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను ఇతర ప్లాన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే, రిలయన్స్ జియో రూ.399 ప్లాన్ దగ్గర మ్యాచ్ అవుతుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్
జియో తరహాలోనే ఎయిర్‌టెల్ కూడా రూ.399 ప్లాన్‌ను తన కస్టమర్‌లకు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు రోజుకు 300 నిమిషాల కాల్స్ తో పాటు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్ రూ.445 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ తరహాలోనే వొడాఫోన్, ఎయిర్‌సెల్, ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్స్ కూడా సిమిలర్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వొడాఫోన్ రూ.445 ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు రోజుకు 1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌సెల్ రూ.449 ప్లాన్...
ఎయిర్‌సెల్ ఆఫర్ చేస్తున్న రూ.449 ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు రోజుకు 2జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








