Home
News

BSNL లక్ష్మీ ఆఫర్, రీచార్జ్ పై సగం టాక్ టైమ్ ఉచితం

By Bommu Sivanjaneyulu

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం సరికొత్త ప్రమోషనల్ టాక్ టైమ్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. 'లక్ష్మీ ప్రమోషనల్’ పేరుతో ఈ టాక్ టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పాన్ ఇండియా మొత్తం వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా రూ.290, రూ.390, రూ.590 రీచార్జులు 50శాతం వరకు అదనపు టాక్ టైమ్‌ను బీఎస్ఎన్ఎల్ యూజర్లు పొందగలుగుతారు.

BSNL Announces Laxmi Promotional Talktime Offer for Prepaid Customers on Diwali

కేవలం ఈ మూడు Top-ups పై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ క్రింద రూ.290 పెట్టి రీచార్జ్ చేసుకున్న వారికి టాక్ టైమ్ క్రింద రూ.435 లభిస్తుంది. రూ.390 పెట్టి రీచార్జ్ చేసుకున్న వారికి రూ.585 టాక్ టైమ్ లభిస్తుంది. రూ.590 పెట్టి రీచార్జ్ చేసకున్న వారికి రూ.885 టాక్ టైమ్ లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

2018 నాటికి తెలుగు రాష్ట్రాల్లో BSNL 4జీ సేవలు

ఆంధ్రప్రదేశ్, తెలింగాణ ప్రాంతాల్లో 4జీ సేవల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 2018 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో 1,150 4జీ సైట్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు టెండర్ ఫర్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయిని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు.

4జీ ప్రాజెక్టకు సంబంధించి టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఇప్పటికే గైడ్‌లైన్స్ అందాయి. వెండర్‌ని కూడా ఫైనలైజ్ చేసేసాం.

బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రాజెక్ట్ నిమిత్తం పాన్ ఇండియా మొత్తం మీద 10,000 4జీ సైట్‌లను ప్లాన్ చేయటం జరిగిది. వాటిలో తెలంగాణకు 550, ఆంధ్రప్రదేశ్‌కు 600 సైట్‌లను కేటాయించటం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ పి. సుధాకర్ రావు తెలిపారు.

ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి...

ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు, భవిష్యత్‌లో వినియోగంలోకి రాబోయే అన్ని మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (DoT) టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆధార్ రీ-వెరిఫికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేసింది.

సుప్రీంకోర్డ్ ఉత్తర్వులు ప్రకారం ఫిబ్రవరి 6, 2018 నాటికి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కావల్సి ఉంది. ఆధార్ రీ-వెరిఫికేషన్‌కు సహకరించాలని బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తమ వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతోంది.

Best Mobiles in India

English summary
BSNL Announces Laxmi Promotional Talktime Offer for Prepaid Customers on Diwali. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X