బీఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్: సిమ్ కార్డ్ ఫ్రీ!

Posted By:

తమ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవటంతో పాటు నెలవారి రివెన్యూలలో 6 నుంచి 7శాతం మేర వృద్ధి సాధించేందకు ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్, పండుగ ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకొచ్చింది. 13వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ 1 తేదీ నుంచి 7వ తేదీ వరకు కొత్త కనెక్షన్‌ల నిమిత్తం సిమ్ కార్డులను ఉచితంగా అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్: సిమ్ కార్డ్ ఫ్రీ!

లిమిటెడ్ పిరియడ్ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ రూ.100 నుంచి రూ.199 పరిధిలోని టాపప్ కూపన్ల పై 15 రోజుల వ్యాలిడిటీతో కూడిన పూర్తి టాక్ టైమ్‌ను అందిస్తోంది. మూడు నెలల పాటు కొనసాగే ఈ ఆఫర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. మరో ప్లాన్‌లో భాగంగా రూ.98 అంతకన్నా ఎక్కువ విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్ల పై 10 శాత అదనపు డేటా యూసేజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేక స్కీమ్ దేశంలోని యువతతో పాటు విద్యార్థులకు మరింత లబ్థి చేకూర్చనుంది.

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ ప్రమోషనల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ విభాగపు సంచాలకులు అనుపమ్ శ్రీవాస్తవా ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు తమ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవటంతో పాటు లవారి రివెన్యూలలో 6 నుంచి 7శాతం మేర వృద్ధి సాధించేందకు దోహదపడగలవని శ్రీవాస్తవా ధీమా వ్యక్తం చేసారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot