100 సంవత్సరాల బిల్లు కట్టాలంటూ బీఎస్ఎన్ఎల్ లొల్లి!!

Posted By:

ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్, కేరళకు చెందిన ఓ వినియోగదారుడిని వంద సంవత్సరాల బిల్లు చెల్లించాలంటూ బేంబేలెత్తించింది. వివరాల్లోకి వెళితే.....కేరళ రాష్ట్రానికి చెందిన సీ.ఏ. ఫ్రాన్సిస్ అనే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడిని 30.12.1899 నుంచి చెల్లించినవల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలాని లేకుండా కనెక్షన్ రద్దు చేస్తామంటూ బీఎస్ఎన్ఎల్ కాల్ సెంటర్ ఫోన్ కాల్స్ హడలెత్తించాయి. మొదట్లో ఈ ఫోన్ కాల్స్‌ను ఫ్రాన్సిస్ అంతగా పట్టించుకోలేదు.

 100 సంవత్సరాల బిల్లు కట్టాలంటూ బీఎస్ఎన్ఎల్ లొల్లి!!

నేనేందుకు పాత బిల్లు చెల్లించాలి. అక్టోబర్ 18న రూ.800 చెల్లించాను, అక్టోబర్ 28న మరో 200 చెల్లించాను. పాత బకాయిలు చెల్లించాలంటూ కాల్ సెంటర్ నుంచి పదే పదే మొబైల్ కాల్స్ వస్తున్నాయి. మీరు బిల్లులు చెల్లించినట్లయితే ఈ కాల్‌ను విస్మరించమని కాల్ సెంటర్ వారు తనకు తెలిపినట్లు ఫ్రాన్సిస్ ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు.

ఫోన్ కాల్స్‌తో విసిగివేసారిన ఫ్రాన్సిస్‌కు 30.12.1899 నుంచి ఉన్న బకాయిలను చెల్లించాలంటూ ఓ నోటీసు కూడా అందింది.మూడు నెలల్లో మొత్తం సొమ్ము చెల్లించాలని, లేదంటే కనెక్షన్‌ను పూర్తిగా నిలిపివేస్తామని సదరు నోటీసులో పేర్కొన్నట్లు ఫ్నాన్సిస్ తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన తాను బీఎస్ఎన్ఎల్ ఆఫీసును సంప్రదించానని కస్టమర్ కేర్ అధికారులు మీరు ఇంతకు ముందే బిల్లును చెల్లించినట్లేయితే, ఈ విషయాన్ని విస్మరించమని తెలిపినట్లు ఆయన అన్నారు. అప్పటి నుంచి తనకు ఏ విధమైన ఫోన్ కాల్స్ రాలేదని అంతేకాకుండా తన కనెక్షన్ రద్దు కాలేదని ఫ్రాన్సిస్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot