300జీబి ఇంటర్నెట్‌ను రూ.249కే అందిస్తోన్న BSNL, ప్లాన్ గురించి 10 ముఖ్యమైన విషయాలు

|

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల BB 249 అన్‌లిమిటెడ్ ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

300జీబి ఇంటర్నెట్‌ను రూ.249కే అందిస్తోన్న BSNL, ప్లాన్ గురించి 10 ముఖ్యమైన విషయాలు

Read More : నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!

ఈ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను వాడుకునే అవకాశంతో పాటు ఉచిత కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి యూజర్‌కు 6 నెలల పాటు వర్తించే ఈ బంపర్ ఆఫర్‌కు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలు...

ప్లాన్ పూర్తిగా అన్‌లిమిటెడ్

ప్లాన్ పూర్తిగా అన్‌లిమిటెడ్

బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న BB 249 పూర్తిగా అన్‌లిమిటెడ్. ఈ ప్లాన్‌లో భాగంగా బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్, కాలింగ్ అన్ని అన్‌లిమిటెడ్.

2 Mbps వేగం

2 Mbps వేగం

బీఎస్ఎన్ఎల్ BB 249 ప్లాన్‌లో భాగంగా యూజర్‌కు నెల మొత్తం మీద వర్తించే 300జీబి ఇంటర్నెట్‌‌లో భాగంగా మొదటి 1జీబి వరకు 2 Mbps వేగం వర్తిస్తుంది. FUP లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1 Mbpsకు పడిపోతుంది.

 

నెలవారి చెల్లించే బిల్లు

నెలవారి చెల్లించే బిల్లు

BB 249 ప్లాన్‌‌ను ఎంపిక చేసుకున్న బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లు మొదటి 6 నెలలు పాటు నెలవారి చెల్లించే బిల్లు ట్యాక్సులతో కలుపుకుని రూ.287గా ఉంటుంది.

ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్

ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్

BB 249 ప్లాన్‌‌లో ఉన్న యూజర్లు ఆదివారాలు రోజంతా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా ఫోన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో రాత్రి తొమ్మిది నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు ఉచితంగా ఫోన్‌ చేసుకునేందుకు అనుమతిస్తారు.

రెంటల్ ఛార్జీలు ఉండవు

రెంటల్ ఛార్జీలు ఉండవు

BB 249 ప్లాన్‌‌లో ఉన్న యూజర్లు ఎటువంటి అదనపు రెంటల్ ఛార్జీలను చెల్లించవల్సన అవసరం ఉండదు.

ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తిస్తుంది

ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తిస్తుంది

BB 249 ఆఫర్ ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తిస్తుంది. ఈ కాలపరిమిత పూర్తి అయిన తరువాత కస్టమర్ ఆటోమెటిక్‌గా BSNL 449 unlimited broadband planకు మారిపోతారు.

ఎంత చెల్లించాల్సి ఉంటుంది

ఎంత చెల్లించాల్సి ఉంటుంది

BB 249 ప్లాన్‌‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే యూజర్లు ఒక నెల బ్రాడ్‌బ్యాండ్ రెంట్‌తో పాటు డిపాజిట్ క్రింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

డిస్‌‌కనెక్ట్‌ అయిన ల్యాండ్‌లైన్‌ ఖాతాదారులు

డిస్‌‌కనెక్ట్‌ అయిన ల్యాండ్‌లైన్‌ ఖాతాదారులు

బిల్లులు చెల్లించక డిస్‌‌కనెక్ట్‌ అయిన ల్యాండ్‌లైన్‌ ఖాతాదారులు కూడా ఈ పథకం కింద మళ్లీ బిఎస్ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ తీసుకోవచ్చు.

మోడెమ్‌ను విడిగా తీసుకోవాలి

మోడెమ్‌ను విడిగా తీసుకోవాలి

బీఎస్ఎన్ఎల్ కొత్త‌బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునే క్రమంలో మోడెమ్‌ను విడిగా మీరు బయట కొనుగోలు చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL BB 249 Unlimited FREE Internet for 6 MONTHS: 10 Important Things You Need to Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X