Home
News

సంవత్సరానికి ఒక్క రీఛార్జ్‌ .. అన్‌లిమిటెడ్ కాలింగ్‌, డేటాతోపాటు అనేక ప్రయోజనాలు..!

BSNL Annual Recharge Plans : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం అనేక బెస్ట్‌ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. కొంత మంది యూజర్లు ప్రతినెలా రీఛార్జ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొంత మంది యూజర్లు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ లను ఎంచుకుంటారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌లో వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1499 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (BSNL Rs1499 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 24GB డేటాను పొందవచ్చు. రోజువారీ ఎటువంటి డేటా పరిమితి లేకుండా ఉపయోగించుకోవచ్చు.

BSNL Annual Recharge Plans

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. కేవలం కాలింగ్‌ కోసం ఫోన్‌ ఉపయోగించే వారు మరియు ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీ కోరుకొనే యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

BSNL రూ.1999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (BSNL Rs1999 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 600GB డేటాను అందిస్తోంది. రోజువారీ ఎటువంటి పరిమితి లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

కాలింగ్‌, ఎక్కువ డేటా అవసరాలు, వ్యాలిడిటీ కోరుకొనే యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ధరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌ ను అందిస్తోంది.

రూ.2399 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (BSNL Rs2399 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా యూజర్లు రోజువారీ 2GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 395 రోజులుగా ఉంది.

ఆజాదీ కా ప్లాన్ :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న BSNL అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఆజాదీ కా ప్లాన్‌ పేరుతో కేవలం రూ.1 కే నెల రోజులపాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ ఆగస్టు 1 నుంచి 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆజాదీ కా ప్లాన్‌ ఆఫర్‌ కేవలం కొత్త సిమ్‌ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారికి రూ.1 రీఛార్జ్‌ పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సంస్థ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X