BSNL బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! ప్రైవేట్ టెల్కోలకు దీటుగా....

|

భారతదేశంలో మొదటి నుంచి అందుబాటులో ఉంటూ అత్యుత్తమంగా మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో (ISPలు) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలోని పనిచేసే ఈ టెల్కో తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలతో డీప్ పాకెట్స్‌కు చేరుకుంది. ఇప్పుడు భారత్ ఫైబర్ బ్రాండ్ ద్వారా టెల్కో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కూడా తన ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మీరు BSNL నుండి బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక మీరు పొందడానికి అనేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ టెల్కోలకు పోటీగా అందిస్తున్న కొన్ని ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

300 Mbps వేగంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

300 Mbps వేగంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ యొక్క అవసరం అధికంగా ఉన్నందున కొత్త కనెక్షన్ ని పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అధిక వేగంతో లభించే ప్లాన్ లను పొందాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం BSNL రూ.1,499 ధర వద్ద అందించే ప్లాన్ తో వినియోగదారులకు 300 Mbps ఇంటర్నెట్ అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ వేగాన్ని అందిస్తుంది. డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ రెండింటికీ ఇంటర్నెట్ వేగం సుష్టంగా ఉంటుంది. దీనితో పాటు వినియోగదారులు ప్రతి నెలా 4TB వరకు ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను కూడా పొందుతారు. ఇది మీ యొక్క ప్రైవేట్ ఆపరేటర్ల నుండి పొందే దానికంటే ఎక్కువ.

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం

అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనం కూడా వినియోగదారుల కోసం బండిల్ చేయబడింది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క వాస్తవ ధర సంవత్సరానికి రూ.1,499 అని గమనించండి. కానీ మీరు ఇక్కడ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా పొందుతారు.

ఫిక్స్‌డ్-లైన్ కనెక్షన్‌
 

BSNL వినియోగదారులకు కాల్స్ చేయడానికి ఫిక్స్‌డ్-లైన్ కనెక్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. కానీ టెలిఫోన్ పరికరాలను క్లయింట్ స్వయంగా కొనుగోలు చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఈ ప్రభుత్వ టెల్కో వినియోగదారులకు మొదటి నెల బిల్లుపై 90% తగ్గింపుతో సుమారు రూ.500 వరకు డిస్కౌంట్ ని అందిస్తుంది. అందువల్ల కొత్త కనెక్షన్ తో పాటుగా ఈ ప్లాన్ ని కొనుగోలు చేయడం అనేది వినియోగదారులకు పాకెట్-ఫ్రెండ్లీ వ్యవహారం.

300 Mbps ప్లాన్‌

BSNL సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం ఇతర 300 Mbps ప్లాన్‌లను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లు ఎలాంటి OTT ప్రయోజనాలను అందించవు మరియు నెలకు అధిక ఖర్చుతో లభిస్తాయి. అవి అధిక ధరను కలిగి ఉండడానికి కారణం అవి ఎక్కువ FUP డేటాను తీసుకురావడమే. రూ.2499 మరియు రూ.4499 ధరల వద్ద లభించే ప్లాన్‌లతో వినియోగదారులు వరుసగా 5TB మరియు 6.5TB నెలవారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లు పెద్ద పెద్ద సంస్థలు లేదా లైబ్రరీలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్రజలు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతారు. కావున ఈ అధిక-ధరతో లభించే ప్లాన్‌లతో లభించే FUP డేటా వినియోగం కూడా మంచిదే.

BSNL 5G సర్వీస్

BSNL 5G సర్వీస్

BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్‌ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు. ఇప్పటివరకు జరిగిన అన్ని పరిణామాల దృష్ట్యా చూసుకుంటే కనుక BSNL టెలికాం సంస్థ 2023 సంవత్సరంలో 5Gని లాంచ్ చేయబోతున్నట్లు నివేదించబడింది. అయితే 2023లోనే లాంచ్ జరగాలనుకుంటే కనుక అది నిజంగా టెల్కోకి మంచి విషయమే. 4G ఆలస్యం కావడంతో ఈ టెల్కో ప్రభుత్వం సాయంతో త్వరగా 5G నెట్‌వర్క్‌ లను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాయి. వినియోగదారులకు తాజా తరం కనెక్టివిటీ సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని BSNL టెల్కో 2022 చివర మరియు 2023 ప్రారంభంలో మరిన్ని ఎక్కువ 4G సైట్‌లను విడుదల చేయడమే కాకుండా వాటిలో ఎక్కువగా 5G సైట్‌లుగా వేగంగా అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో ఉంది.

BSNL అపరిమిత డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌

BSNL టెలికాం సంస్థ రూ. 400 లోపు ధరతో రూ.398 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 30 రోజుల వాలిడిటీ కాలానికి తన యొక్క వినియోగదారులకు నిజమైన అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో FUP డేటా వర్తించదు కావున అపరిమిత డేటాను పొందవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు. రూ.400 లోపు ధరతో అపరిమిత డేటాను అందిస్తున్న ఏకైక టెల్కో BSNL కావడంతో ఇది మార్కెట్‌లోని ప్రత్యేకమైన ప్లాన్‌లలో ఒకటిగా నిలిచింది. BSNL అందించే ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరిన్ని పుష్కలంగా ఉన్నాయ. అయితే ఈ ప్రభుత్వ టెల్కో ప్రైవేట్ ఆపరేటర్‌ల కంటే వెనుకబడి ఉండటానికి గల ఏకైక కారణం 4G లేకపోవడం. BSNL టెల్కో 2022 చివరి నాటికి 4G నెట్‌వర్క్‌లను విస్తృత స్థాయిలో ప్రారంభించాలని చూస్తోంది. 2023లో BSNL కూడా స్వదేశీ గేర్‌ల ద్వారా 5Gని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇదే కనుక జరిగితే అతి త్వరలో స్వదేశీ నెట్‌వర్క్ ద్వారా 4G సేవలను అందించే ఏకైక టెల్కోగా BSNL అవతరిస్తుంది. అంతేకాకుండా BSNL కి ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్ కూడా అవుతుంది. 4G మరియు 5G అందుబాటులోకి వస్తే కనుక ప్రైవేట్ టెల్కోలందరికి కూడా గడ్డు కాలం మొదలు అయినట్లే.

Best Mobiles in India

English summary
BSNL Best Broadband Plans to Defiance of Private Telcos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X