ధర రూ.500 లోపు BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు..!
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ BSNL కు రోజురోజుకు ఆధరణ పెరుగుతోంది. జులై నెలలో ప్రైవేటు రంగ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ - ఐడియా భారీగా ధరలు పెంచాయి. అప్పటి నుంచి లక్షల మంది వినియోగదారులు BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కు పోర్టింగ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను ట్రాయ్ ఇటీవల విడుదల చేసింది. అయితే తక్కువ ధరలో సేవలు అందించడం సహా 4G, 5G నెట్‌వర్క్ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉండడంతో బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొబైల్ యూజర్లు మొగ్గు చూపుతున్నారు.
దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ ను (BSNL 4G Network) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు BSNL వేగంగా పనిచేస్తోంది. ఇందుకోసం లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 35,000 టవర్లను ఏర్పాటు చేసింది. తాజాగా లడఖ్‌లోని ఫోబ్రాంగ్‌లో సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో BSNL 4G టవర్ ను ఏర్పాటు చేసింది. 2025 జూన్ నాటికి మొత్తం లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది.

ధర రూ.500 లోపు మెరుగైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు :
ప్రస్తుతం BSNL అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో అధిక డేటా అందించే ప్లాన్‌లు సహా వ్యాలిడిటీ పొడిగించే ప్లాన్‌లు కూడా ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం రూ.500 లోపు అనేక (BSNL Best Recharge Plans Under RS500) రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. అందులో రూ.229 ప్లాన్, రూ.347 ప్లాన్, రూ.399 రీఛార్జ్ ప్లాన్, రూ.485 ప్లాన్‌లు ఉన్నాయి.
రూ.229 రీఛార్జ్ ప్లాన్ : BSNL రూ.229 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.347 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : బీఎస్‌ఎన్‌ఎల్ రూ.347 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది.
రూ.399 రీఛార్జ్ ప్లాన్ : BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.399 ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 80 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డేటాపరంగా ఈ ప్లాన్ రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. ప్రైవేటు నెట్‌వర్క్‌లతో పోలిస్తే BSNL తక్కువ ధరకే ప్లాన్‌లను అందిస్తున్నా.. డేటా వేగం విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్ బాగా వెనుకబడి ఉంది.


Click it and Unblock the Notifications








