BSNL సిమ్‌ను వినియోగిస్తున్నారా.. అయితే ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు మీకు పనికొస్తాయి..?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఈ సంవత్సరం జులై నుంచి ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా రీఛార్జ్ ధరలు పెంచడంతో BSNL వైపు లక్షలాది మంది యూజర్లు మొగ్గు చూపుతున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాల ఆధారంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా సంఖ్యలో కొత్త యూజర్లు BSNL నెట్‌వర్క్ లో చేరారు.
ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. దీంతోపాటు వచ్చే సంవత్సరం నుంచి 4G ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే విధంగా దేశవ్యాప్తంగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు జూన్ 2025 నుంచి 5G నెట్‌వర్క్ ను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే BSNL యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. రూ.628 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు.
3GB డేటా వినియోగం (BSNL RS628 Prepaid Recharge Plan) అనంతరం.. డేటా వేగం 40kbps కి తగ్గుతుంది. మొత్తంగా ఈ ప్లాన్ లో భాగంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు BSNL ట్యూన్స్, హార్డీ గేమ్స్ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
అదే రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తోనూ (BSNL RS299 Prepaid Recharge Plan) రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిటిడీ 30 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 90GB డేటాను వినియోగించుకోవచ్చు.
రూ.2999 రీఛార్జ్ ప్లాన్ : ఈ BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL RS2999 Prepaid Recharge Plan) ద్వారా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 1095GB డేటాను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు రూ.1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 3GB డేటా, 300 నిమిషాల కాలింగ్ టైం, 30 SMS లను ఉపయోగించుకోవచ్చు. తక్కువగా ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
BSNL రూ.1499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 24GB ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ప్రయోజనాల ఆధారంగా కాలింగ్ కోసమే ఫోన్‌ను వినియోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








