2021 మే నెలలో ఉత్తమంగా గల BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...

|

భారత ప్రభుత్వం యొక్క టెల్కో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ టెల్కోలు అయిన రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలతో నేరుగా పోటీ పడటానికి గత ఏడాది అక్టోబర్‌లో 'భారత్ ఫైబర్' బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రారంభించింది. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల (ISP లు) యొక్క ప్లాన్ల ధరలు మరియు వాటి ప్రయోజనాలతో పోలిస్తే BSNL యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు మెరుగ్గా ఉన్నాయి.

 

OTT

వినియోగదారులు టన్నుల కొద్ది డేటా ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను కూడా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్లతో కూడిన ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా అదనంగా ఉంది. మే 2021 లో ఉత్తమంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మే 2021ఉత్తమమైన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

మే 2021ఉత్తమమైన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

2021 మే నెలలో బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ తన వినియోగదారులకు ఉత్తమంగా ఆరు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నది. ఈ ప్లాన్లు వరుసగా 'ఫైబర్ బేసిక్', 'ఫైబర్ బేసిక్ ప్లస్', 'ఫైబర్ వాల్యూ', 'ఫైబర్ ప్రీమియం', 'ఫైబర్ ప్రీమియం ప్లస్' మరియు 'ఫైబర్ అల్ట్రా ' వంటి పేర్లను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్లు 30 Mbps నుండి 300 Mbps వేగంతో డేటాను సరఫరా చేస్తాయి.

ఫైబర్ బేసిక్
 

'ఫైబర్ బేసిక్' పేరుతో లభించే బేస్ ప్లాన్ వినియోగదారులకు 3.3TB డేటాను 30Mbps స్పీడ్‌తో అందిస్తుంది. దీనితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఎఫ్‌యుపి డేటా వినియోగం తరువాత డేటా స్పీడ్ 2Mbpsకు పడిపోతుంది. 'ఫైబర్ బేసిక్ ప్లస్' ప్లాన్ 60 Mbps వేగంతో 3.3TB డేటాను అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌తో అందిస్తుంది. FUP డేటాను వినియోగించిన తర్వాత వేగం 2 Mbps కి పడిపోతుంది. ఈ రెండు ప్లాన్ లకు ఎటువంటి OTT ప్రయోజనాలు లేవు.

ఫైబర్ వాల్యూ

'ఫైబర్ వాల్యూ' పేరుతో లభించే మూడవ ప్లాన్‌ 100Mbps వేగంతో అదే 3.3TB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌ ఉంటుంది. చివరిగా 200 Mbps మరియు 300 Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే 200Mbps వేగంతో లభించే 'ఫైబర్ ప్రీమియం' ప్లాన్ 3.3TB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం యొక్క OTT ప్రయోజనం ఒక సంవత్సరానికి వస్తుంది. FUP తరువాత ఇంటర్నెట్ వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది.

ఫైబర్ ప్రీమియం ప్లస్

200 Mbps అదే వేగంతో లభించే 'ఫైబర్ ప్రీమియం ప్లస్' వినియోగదారులకు ఎటువంటి OTT ప్రయోజనం లేకుండా 3.3TB డేటాను అందిస్తుంది. FUP డేటా యొక్క వినియోగం తరువాత స్పీడ్ 15 Mbps కు పడిపోతుంది. సంస్థ నుండి లభించే చివరిది మరియు అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'ఫైబర్ అల్ట్రా' ప్లాన్ 300 Mbps వేగంతో వస్తుంది. ఇది వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం యొక్క ఒక సంవత్సరం ఉచిత చందాతో పాటుగా 3.3TB డేటాను అందిస్తుంది.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల యొక్క ధరల విషయానికి వస్తే 'ఫైబర్ బేసిక్' ప్లాన్ నెలకు రూ.449 ధర వద్ద వస్తుంది. ఇంకా 'ఫైబర్ బేసిక్ ప్లస్' ప్లాన్‌ యొక్క ధర నెలకు రూ.599. అలాగే 'ఫైబర్ వాల్యూ' ప్లాన్‌ యొక్క ధర నెలకు రూ.799 కాగా 'ఫైబర్ ప్రీమియం' ప్లాన్‌ యొక్క ధర నెలకు రూ.999 అయితే 'ఫైబర్ ప్రీమియం ప్లస్' ప్లాన్‌ యొక్క ధర నెలకు రూ.1,277. చివరగా 'ఫైబర్ అల్ట్రా' ప్లాన్ యొక్క ధర నెలకు రూ.1,499 లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
BSNL Bharat Fiber Broadband Best Plans For The Month of May 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X