భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను అమాంతం పెంచిన BSNL

|

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బిఎస్ఎన్ఎల్ టెలికామ్ రంగంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తన సేవలను అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ భారత్ ఫైబర్ కేటగిరీ కింద ల్యాండ్ లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల యొక్క ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను పెంచింది.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు
 

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీల పెంపు భారతదేశం అంతటా కొత్తగా భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను కొనుగోలు చేసే వారికి వర్తిస్తుంది. దీనితో పాటుగా భారత్ ఫైబర్ వాయిస్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కాంబో ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులు సవరించిన ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను కూడా చెల్లించవలసి ఉంటుంది అని కూడా తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Also Read: Reliance Jio రూ.598 క్రికెట్ కొత్త ప్లాన్!!! IPL 2020 కోసం సరైన ఛాయస్.... ‌

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీల పెంపు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీల పెంపు

బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలతో కాంబో ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చార్జీలను అధిక మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది. మునుపటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.250 లతో పోలిస్తే ప్రస్తుతం ఇన్‌స్టాలేషన్ చార్జీలు రూ.500 గా ఉన్నాయి. అంటే మునుపటి చార్జీలతో పోలిస్తే ఇప్పుడు రూ.250 పెరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాయిస్ సర్వీసుపై భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఎంచుకునే వినియోగదారులు మాత్రం ఇప్పటికే ఉన్న రూ .250 ఛార్జీలను ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా చెల్లించడం కొనసాగించవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ హైలైట్ చేసింది.

భారత్ ఫైబర్ యూజర్లు ఇన్‌స్టాలేషన్ చార్జీలు లేకుండా ఉండే మార్గం

భారత్ ఫైబర్ యూజర్లు ఇన్‌స్టాలేషన్ చార్జీలు లేకుండా ఉండే మార్గం

భారత్ ఫైబర్ యొక్క వాయిస్, బ్రాడ్‌బ్యాండ్ మరియు కాంబో ప్లాన్‌లను కొత్తగా ఎంచుకునే వినియోగదారులు తమ యొక్క ప్లాన్లను ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఎంచుకుంటే కనుక ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేస్తామని ఆపరేటర్ తెలిపింది.

"భరత్ ఫైబర్ కేటగిరీ కింద కనెక్షన్‌కు పైన పేర్కొన్న విధంగా ONT ఇన్‌స్టాలేషన్ కోసం ప్రత్యేక ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు సర్వీస్ స్థాయి ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయబడవు" అని ఆపరేటర్ సర్క్యులర్‌లో తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Bharat Fiber Installation Amount Increased

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X