Home
News

BSNL Bharat Fiber కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే!!! జియోకు గట్టి పోటీగా...

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ టెలికామ్ రంగంతో పాటుగా బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారత్ ఫైబర్ పేరుతో అద్భుతమైన సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఎక్కువ మంది పోటీదారులు రావడంతో నష్టపోతున్న మార్కెట్ వాటాను నిలుపుకోవటానికి బిఎస్ఎన్ఎల్ కొత్తగా మరికొన్ని ప్లాన్లను ప్రారంభించింది. రూ.449 ప్రారంభ ధరతో ఎంపిక చేసిన నగరాల్లో 2020 అక్టోబర్ 1 నుండి బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారత్ ఫైబర్ vs జియోఫైబర్

భారత్ ఫైబర్ vs జియోఫైబర్

భారత్ ఫైబర్ యొక్క కొత్త  ప్లాన్‌లు ఇప్పుడు రూ .399 నుండి ప్రారంబమయ్యే మరియు కొత్తగా సవరించిన జియోఫైబర్ యొక్క ప్లాన్‌లకు గట్టి పోటీగా మారనున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క నాలుగు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.449, రూ.799, రూ.999 మరియు రూ.1,499. బిఎస్ఎన్ఎల్ వీటిని ప్రచార ప్రాతిపదికన ప్రవేశపెట్టనున్నది. అంటే అవి అక్టోబర్ 1 నుండి 90 రోజుల చెల్లుబాటు వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ఈ భారత్ ఫైబర్ ప్లాన్‌లను కొన్ని నగరాలు / ప్రాంతాలలో మాత్రమే అందిస్తుంది.

భారత్ ఫైబర్ రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ రూ.449 ధర వద్ద అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ‘ఫైబర్ బేసిక్' పేరుతో లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 30Mbps వేగంతో 3.3TB లేదా 3300GB FUP డేటాను అందిస్తుంది. FUP పరిమితి దాటిన తరువాత దీని యొక్క వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ అండమాన్ & నికోబార్ సర్కిల్ మినహా అన్ని సర్కిల్‌లలో అందుబాటులోకి రానున్నది. దీనిని ఎంచుకున్న బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అదనంగా పొందుతారు.

భారత్ ఫైబర్ రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ యొక్క కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల జాబితాలో రెండవది బిఎస్ఎన్ఎల్ ఫైబర్ వాల్యూ ప్లాన్. ఇది నెలకు రూ.799 ధర వద్ద లభిస్తుంది. ఇది వినియోగదారులకు 100Mbps వేగంతో 3300GB లేదా 3.3TB FUP డేటాను అందిస్తుంది.  FUP పరిమితి దాటిన తరువాత దీని యొక్క వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ల్యాండ్‌లైన్ కాలింగ్ ప్రయోజనాలను కూడా వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌ల కోసం బిఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక ఎంపికలను అందించడం లేదు.

భారత్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం ప్లాన్ పూర్తి వివరాలు

రూ.999 ధర వద్ద లభించే బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ యొక్క ప్రీమియం ప్లాన్ రూ.999 అదే ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్‌కు గట్టి పోటీని ఇస్తుంది. ఈ ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 200Mbps వేగంతో 3.3TB FUP డేటాను అందిస్తుంది. అలాగే దీని యొక్క ఎఫ్‌యుపి పరిమితి దాటిని తరువాత డేటా యొక్క అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ వేగం 2Mbps కు తగ్గించబడుతుంది. ఏదేమైనా FUP వేగం తర్వాత జియోఫైబర్ 1 Mbps వేగంతో డేటాను అందిస్తూ ఉంటుంది ఇది కూడా తక్కువగా ఉంది. బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కోసం కూడా  ఎటువంటి దీర్ఘకాలిక ఎంపికను ఇవ్వడం లేదు మరియు చందాదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

భారత్ ఫైబర్ రూ.1499 బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం ప్లాన్ పూర్తి వివరాలు

భారత్ ఫైబర్ రూ.1499 బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం ప్లాన్ పూర్తి వివరాలు

చివరగా రూ.1,499 ధర వద్ద లభించే బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అల్ట్రా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా వినియోగదారులకు 300Mbps వేగంతో డేటాను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ నుండి ఇప్పటివరకు అత్యధిక ప్రీమియం ఆఫర్ ఇదే కావడం విశేషం. ఎందుకంటే కంపెనీ ప్రస్తుతం అనేక నగరాల్లో గరిష్టంగా 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో అందిస్తోంది. ఇది 300 Mbps వేగంతో 4000GB లేదా 4TB FUP పరిమితి డేటాను అందిస్తుంది. FUP తర్వాత డేటా వేగం 4 Mbpsకు తగ్గించబడుతుంది. అలాగే ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ప్రీమియం మరియు ఫైబర్ అల్ట్రా ప్లాన్స్ డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తాయి. 

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Bharat Fiber New Broadband Plans Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X