బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు పండుగ చేసుకునే వార్త
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తుంది.బిఎస్ఎన్ఎల్ ఈ ఏడాది జనవరిలో తన భారత్ ఫైబర్ స్కీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తుంది.బిఎస్ఎన్ఎల్ ఈ ఏడాది జనవరిలో తన భారత్ ఫైబర్ స్కీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వాలనే ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ స్కీమ్ ను ప్రారంభించింది.అయితే బీఎస్‌ఎన్‌ఎల్ తన యూజర్లకు మరో ఆఫర్ ప్రకటించింది.ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్
రూ.777 ఆపైన విలువ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను వాడుతున్న కస్టమర్లకు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా..
ఇందుకు గాను కస్టమర్లు అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ప్లాన్లను వాడేవారు బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అమెజాన్ ఆఫర్స్ బ్యానర్‌పై..
వెబ్‌సైట్‌లో కనిపించే అమెజాన్ ఆఫర్స్ బ్యానర్‌పై క్లిక్ చేసిన అనంతరం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి అనంతరం వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్
దీంతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, బుక్స్ సేవలు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్
గత ఏడాది ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఇచ్చింది


Click it and Unblock the Notifications