BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు!! రెట్టింపు వేగంతో అధిక డేటా

|

ఇండియాలోని అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)లలో ఒకటైన బిఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మరొకసారి సవరించింది. అక్టోబర్‌లో సరసమైన ధరలోభారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టడంతో ఎక్కువ మంది చందాదారులను పొందినట్లు చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పోల్చితే ఇప్పుడు రెట్టింపు వేగంతో అందివ్వడమే కాకుండా పది రెట్లు ఎక్కువ డేటాను అందించే కొత్త ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ సవరించిన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో మొదటిది రూ.499 భారత్ ఫైబర్ ప్లాన్. ఇది ఇప్పుడు 100GB వరకు 50Mbps వేగంతో లభిస్తుంది. ఆ తర్వాత డేటా స్పీడ్ 2Mbps‌కు తగ్గించబడుతుంది. తరువాత రూ.779 ధర వద్ద లభించే ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం లభ్యతతో పాటుగా ఇప్పుడు 300GB వరకు 100Mbps స్పీడ్ లభిస్తుంది. FUP తర్వాత డేటా స్పీడ్ 5Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ రూ.1,499 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందాను ఉచితంగా అందిస్తుంది.

600GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

600GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో రూ.849 ధర వద్ద లభించే 600GB సియుఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100Mbps వేగంతో నెలకు 600GB డేటాను అందిస్తుంది. తరువాత డేటా స్పీడ్ 10Mbps ‌కు తగ్గించబడుతుంది. అలాగే రూ.949 ధర వద్ద గల భారత్ ఫైబర్ ప్లాన్ ఇప్పుడు 500GB వరకు 100 Mbps వేగంతో మరియు FUP వేగం తర్వాత 10 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ ఉచితంగా డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.949 ప్లాన్‌ను సూపర్ స్టార్ 500 అని కూడా పిలుస్తారు.

BSNL 200 Mbps స్పీడ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

BSNL 200 Mbps స్పీడ్ ప్లాన్‌లలో కొత్త సవరణలు

బిఎస్ఎన్ఎల్ కొత్తగా సవరించిన ప్లాన్‌లలో రూ.1,277 ధర వద్ద లభించే భారత్ ఫైబర్ ప్లాన్ కూడా ఉంది. ఇది ఇప్పుడు 200Mbps వేగంతో 3.3TB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా తరువాత స్పీడ్ 15Mbps కు తగ్గించబడుతుంది. చివరగా రూ .1,999 ధర వద్ద గల ప్లాన్ 4TB వరకు డేటాను 200 Mbps వేగంతో అందిస్తుంది. FUP పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 20 Mbps తగ్గించబడి అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఈ సవరణలతో ఇప్పటి వరకు పరిశ్రమలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించవచ్చు.

భారత్ ఫైబర్ పాన్-ఇండియా ప్లాన్‌లలో కొత్త సవరణలు

భారత్ ఫైబర్ పాన్-ఇండియా ప్లాన్‌లలో కొత్త సవరణలు

రూ .2,499 ధర వద్ద లభించే బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ పాన్-ఇండియా ప్లాన్ లో సవరణలను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఇప్పుడు 200Mbps వేగంతో 4TB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 20Mbps కు తగ్గించబడుతుంది. అలాగే రూ.4,499, రూ.5,999, రూ .9,999, రూ .16,999 ధర వద్ద లభించే ఇతర ప్లాన్‌లు వినియోగదారులకు 200Mbps వేగంతో FUP పరిమిత డేటాను అందిస్తాయి. అయితే FUP దాటిన తరువాత డేటా స్పీడ్ 20Mbpsకు తగ్గించబడతాయి.

Best Mobiles in India

English summary
BSNL Bharat Fiber Plans Revised Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X