Home
News

OTT ఉచిత యాక్సిస్ లతో లభించే BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!!

కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. అప్పటి నుంచి చోటు చేసుకున్న కొన్ని అపూర్వమైన సంఘటనలలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుండి పని చేయవలసి వచ్చినందున దాదాపుగా ప్రతి ఇంటికి మరియు చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఇంటర్నెట్ అనేది అవసరంగా మారింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన వివిధ అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్‌లను అందజేస్తున్నారు. అయితే వినియోగదారులు ఎల్లప్పుడూ తాము పొందే సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అదనంగా అధిక డిమాండ్ గల ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సిస్ ను కోరుకుంటారు. వీటిని ISPలు తమ ప్లాన్‌లతో కలిపి అందిస్తున్నారు. దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత యాక్సిస్ తో అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTT ప్రయోజనాలతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

OTT ప్రయోజనాలతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జాబితాలోని మొదటి ప్లాన్ BSNL అందించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లలో ఒకటి 'సూపర్‌స్టార్ ప్రీమియం-1' ప్యాక్. ఈ ప్యాక్ నెలకు రూ.749 ధర వద్ద 100 Mbps ఇంటర్నెట్ వేగంతో 1000GB డేటాను అందిస్తుంది. 1000GB సెట్ పరిమితిని దాటిన తరువాత వినియోగదారులు 5 Mbps వేగంతో ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ అపరిమిత డేటా డౌన్‌లోడ్ మరియు అపరిమిత లోకల్ మరియు STD కాల్‌లను అందిస్తుంది. అలాగే ఇది SonyLIV ప్రీమియం, Zee5 ప్రీమియం వంటి మరికొన్ని OTTలకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

సూపర్‌స్టార్ ప్రీమియం-2

జాబితాలోని తదుపరి ప్లాన్ 'సూపర్‌స్టార్ ప్రీమియం-2' ప్యాక్. ఇది టెల్కో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖ ప్లాన్‌గా కూడా పేర్కొనబడింది. ఈ ప్లాన్ నెలకు రూ.949 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్యాక్ తో వినియోగదారులు 150 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో 2000GB వరకు డేటాను పొందవచ్చు. దీని తరువాత డేటా స్పీడ్ 10 Mbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటా డౌన్‌లోడ్ మరియు అపరిమిత లోకల్ మరియు STD కాల్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో బండిల్ చేయబడిన OTT ప్లాట్‌ఫారమ్‌లలో అదే SonyLIV ప్రీమియం, Zee5 ప్రీమియం మరికొన్ని ఉన్నాయి.

ఫైబర్ ప్రీమియం

జాబితాలోని తదుపరి ప్లాన్ కేవలం రూ.50 అదనపు ఖర్చుతో BSNL ‘ఫైబర్ ప్రీమియం' బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3300GB పరిమితి గల డేటాను 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో అందిస్తుంది. ఆపై డేటా స్పీడ్ 2 Mbpsకి తగ్గించబడుతుంది. పైన పేర్కొన్న ప్లాన్‌ల ప్రకారం వినియోగదారులు అపరిమిత డేటా డౌన్‌లోడ్ మరియు అపరిమిత లోకల్ మరియు STD కాల్‌లను ఆస్వాదించవచ్చు. OTT ప్రయోజనం పరిగణించబడితే ఈ ప్యాక్ దేశంలోని ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్యాక్‌కి ఉచితంగా యాక్సెస్‌ను అందిస్తుంది.

ఫైబర్ అల్ట్రా ప్యాక్

జాబితాలోని చివరి ప్లాన్ టెల్కో అందించే అత్యంత హై-ఎండ్ ప్లాన్‌లలో ఒకటైన ‘ఫైబర్ అల్ట్రా' ప్యాక్. ఇది నెలకు రూ.1,499 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ కనెక్షన్ 300 Mbps వేగంతో 4000GB డేటా పరిమితితో ఇంటర్నెట్ ను పొందుతారు. దీని తరువాత 4 Mbps తగ్గించబడిన వేగంతో అపరిమిత డేటాను వినియోగదారులు ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. పైన పేర్కొన్న ప్లాన్ ప్రకారం అపరిమిత డేటా డౌన్‌లోడ్ మరియు అపరిమిత లోకల్ మరియు STD కాల్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ అలాగే ‘ఫైబర్ ప్రీమియం' ప్లాన్ కూడా డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్యాక్‌కి ఉచితంగా యాక్సెస్‌తో వస్తుంది.

BSNL

దీనితో పాటు ఈ ప్లాన్‌లన్నీ ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇక్కడ వినియోగదారులు ఈ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసినప్పుడు మొదటి నెల అద్దెపై రూ.500 వరకు 90% తగ్గింపును పొందవచ్చు. ఈ ప్లాన్‌లు కొన్ని సందర్భాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉండవచ్చని మరియు BSNL అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనబడిందని గమనించాలి. పేర్కొన్న ధరలన్నీ GSTకి మినహాయించబడినవి మరియు ఇది వర్తించే విధంగా ఛార్జ్ చేయబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Bharat Fibre Broadband Plans Available with OTT Free Access: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X