BSNL బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బంపర్ ఆఫర్!! కొద్ది రోజులు మాత్రమే...

|

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ అందించే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్ ను కొనుగోలు చేయాలని చూసే వారికి ఇప్పుడు మంచి సువర్ణ అవకాశం ఇస్తున్నది. 2021 ఏప్రిల్ 30 లోపు వినియోగదారులు ఎంచుకున్న స్థిర-లైన్ కనెక్షన్ కోసం ఇన్స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేసింది. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, డిఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు మరియు ల్యాండ్‌లైన్ సర్వీస్ వంటి అనేక సేవలను టెల్కో తన యొక్క వినియోగదారులకు అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్
 

ఇంటర్నెట్ సేవలకు బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్ ను ఎంచుకునే వారికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మాఫీ చేయబడతాయి. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 8 నాటి సర్క్యులర్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ ఏదైనా నిర్దిష్ట సర్కిల్‌కు మాత్రమే పరిమితం కాకుండా పాన్-ఇండియా అంతటా అందుబాటులో ఉంటుంది. డిల్లీలోని టెల్కో ప్రధాన కార్యాలయం ఇతర రాష్ట్ర సర్కిల్‌లోని తమ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని కూడా నవీకరించమని కోరుతూ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇంకా ఈ ఆఫర్ వెంటనే అమలులోకి వచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్ కోసం చూస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఇప్పుడు కొనుగోలు చేస్తే ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

క్రొత్త BSNL కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ చార్జీలు

క్రొత్త BSNL కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ చార్జీలు

BSNL అందించే ఈ క్రొత్త ఆఫర్‌తో వినియోగదారులు ఖచ్చితంగా ఎంత ఆదా చేస్తున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇది మీరు ఊహించిన మొత్తం కంటే గణనీయంగానే ఉంది. ఓన్లీ-బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఇన్‌స్టాలేషన్ ఛార్జీగా రూ.250 చెల్లించాలి. కానీ భారత్ ఫైబర్ కనెక్షన్ల కోసం వినియోగదారులు ఇన్స్టాలేషన్ ఛార్జీగా రూ.500 చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న వాయిస్ కాలింగ్ సర్వీస్ కంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి అదనంగా మళ్లీ రూ.250 చెల్లించవలసి ఉంటుంది.

JioFiber VS BSNL ఇన్‌స్టాలేషన్ చార్జీలు

JioFiber VS BSNL ఇన్‌స్టాలేషన్ చార్జీలు

JioFiber యొక్క యొక్క ఇన్‌స్టాలేషన్ చార్జీలతో పోలిస్తే ఈ ఖర్చు అధికంగా ఏమీ లేదు. JioFiber వినియోగదారులు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా తిరిగి చెల్లించని రూ.1,000 మొత్తాన్ని మరియు సంస్థ అందించే ONU పరికరాలకు వ్యతిరేకంగా సెక్యూరిటీ డిపాజిట్ కోసం అదనంగా 1,500 రూపాయలు చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్ అయితే పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది.

బిఎస్‌ఎన్‌ఎల్
 

బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని ఎంచుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీల నుండి మినహాయింపు పొందవచ్చని గమనించండి. అయితే దీర్ఘకాలిక ప్లాన్ లను ఎంచుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఏమి ఉండవు. ఇది పరిమిత ఆఫర్ కావున మీరు దీర్ఘకాలిక ప్లాన్ లను పొందాలని ఆలోచిస్తుంటే మీరు ఏమైనప్పటికీ ఇన్‌స్టాలేషన్ ఛార్జీని చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Broadband New Connection Waived Off Installation Charges: Here are Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X