Home
News

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇండియాలో టెలికామ్ రంగంలోనే కాకుండా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా తన యొక్క వినియోగదారులకు బ్రహ్మాండమైన అనేక ఎంపికలను అందిస్తుంది. ప్రైవేట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు చాలా వరకు తమ యొక్క ప్లాన్ లతో OTT సబ్స్క్రిప్షన్ లను ఉచితంగా అందిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే BSNL టెల్కో దాని రెండు హై-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.1499 మరియు రూ.999 ధరల వద్ద లభిస్తాయి. రెండూ పాత ప్లాన్‌లు కానీ ఇప్పుడు కొత్త వినియోగదారుల కోసం తగ్గింపు ఆఫర్‌తో వస్తున్నాయి. ఈ ప్లాన్‌ల వివరాల గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం బెనిఫిట్‌తో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం బెనిఫిట్‌తో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

BSNL బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్రీమియం ప్రయోజనాన్ని రూ.999 మరియు రూ.1499 ధరల వద్ద లభించే రెండు ప్లాన్‌లతో అందిస్తోంది. ఈ ప్లాన్‌లు ఇంతకు ముందు కూడా ఈ OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందించేవి మరియు ప్రయోజనాలలో ఎటువంటి మార్పును పొందలేదు. అయితే కొత్త వినియోగదారులు మొదటి నెల బిల్లుపై పెద్ద తగ్గింపును పొందుతారు. రూ.1499 ధర వద్ద లభించే ఫైబర్ అల్ట్రా ప్లాన్ ను ఎంచుకున్న వారికి డౌన్‌లోడ్ చేయడానికి మరియు అప్‌లోడ్ చేయడానికి 300 Mbps వేగంతో అందించబడుతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు 4TB లేదా 4000GB డేటాను పొందుతారు. ఇంకా వినియోగదారుల కోసం ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా ఉంది. అయితే పైన పేర్కొన్న విధంగా ఈ ప్లాన్‌లోని కొత్త వినియోగదారులు రూ.500 వరకు మొదటి బిల్లుపై 90% తగ్గింపును పొందుతారు. FUP డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ వేగం 4 Mbpsకి పడిపోతుంది.

BSNL బ్రాడ్‌బ్యాండ్

BSNL బ్రాడ్‌బ్యాండ్ అందించే మరొక ప్లాన్ రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 150 Mbps వేగంతో 2TB నెలవారీ డేటాను అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క ఉచిత ప్రయోజనాన్ని అందించే ఈ ధర పరిధిలో ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ISPలు) నుండి ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఏవీ లేవు. ఖచ్చితంగా జియోఫైబర్ మరియు Airtel Xstream Fiber వంటి ISPలు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే ఇది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కాదు. కాబట్టి మీరు ఈ నిర్దిష్ట OTT ప్రయోజనంతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే BSNL భారత్ ఫైబర్ ప్లాన్ మాత్రమే మీకు అందుబాటు ధరలో లభిస్తుంది.

BSNL భారత్ ఫైబర్

BSNL భారత్ ఫైబర్ కూడా రూ.749 ధర వద్ద OTT ప్రయోజనాలతో ఒక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు పుష్కలంగా OTT ప్రయోజనాలను అందిస్తుంది కానీ Disney+ హాట్‌స్టార్ ప్రీమియంను అందించదు. రూ.1499 ధర వద్ద జియోఫైబర్ యొక్క ప్లాన్ 300 Mbps వేగంతో బహుళ OTT ప్రయోజనాలతో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో BSNL బ్రాడ్‌బ్యాండ్ అందించే మెరుగైన ప్రయోజనాలు లేవు.

BSNL - అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఆఫర్

BSNL - అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఆఫర్

BSNL BOSS పోర్టల్ ద్వారా వార్షిక అడ్వాన్స్ పేమెంట్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సబ్‌స్క్రైబర్‌లు ఈ ఆఫర్‌ను పొందడానికి అర్హులు. BSNL ప్రకారం ఈ ఆఫర్ ను పొందడానికి రూ.999 కంటే తక్కువ ధర ఉన్న ఇంటర్నెట్ సేవలను ఎంచుకునే వినియోగదారులు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సబ్‌స్క్రైబర్‌లు BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌కి వెళ్లడం ద్వారా లేదా BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌లను సందర్శించడం ద్వారా సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ని పొందడానికి వినియోగదారులు BSNL BOSS పోర్టల్‌కి వెళ్లి డివైస్ ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా వారి ప్లాన్ వార్షిక పేమెంట్ పథకం కింద ఒక సంవత్సరానికి ఆన్‌లైన్ అడ్వాన్స్ పేమెంట్ చేయవచ్చు. విజయవంతమైన పేమెంట్ తర్వాత BSNL కస్టమర్ యొక్క బిల్లింగ్ అడ్రసుకు పరికరాన్ని బట్వాడా చేస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Broadband Plans Offering Disney + Hotstar Premium Free Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X