Disney+ Hotstar Premium సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బ్రాడ్‌బ్యాండ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు సరసమైన ధరల వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.449 నుండి ప్రారంభమయ్యే ఈ ప్లాన్‌లు సంస్థ యొక్క భారత్ ఫైబర్ బ్రాండింగ్‌లో 300 Mbps వేగంతో డేటాను అందిస్తాయి. బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.449 (ఫైబర్ బేసిక్), రూ.599 (ఫైబర్ బేసిక్ ప్లస్), రూ.799 (ఫైబర్ వాల్యూ), రూ.999 (ఫైబర్ ప్రీమియం), రూ.1,499 (ఫైబర్ అల్ట్రా) ధరల వద్ద లభిస్తాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లేయర్‌లను కాకుండా డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.999 & రూ.1,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ప్రయోజనాలు
రూ.999 ధర వద్ద లభించే ఫైబర్ ప్రీమియం బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రతి నెలా 3.3TB వరకు డేటాను 200Mbps వేగంతో అందిస్తుంది. FUP పరిమితి తరువాత వినియోగదారులు 2 Mbps వేగంతో అపరిమిత డేటాను బ్రౌజ్ చేయవచ్చు. అలాగే రూ.1,499 భారత్ ఫైబర్ ప్లాన్ అదే 3.3TB FUP పరిమిత డేటాను 300Mbps వేగంతో వస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తాయి.

ఇవి డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం చందాను ఉచితంగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ వంటి ISP లు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో చాలా OTT చందాలను అందిస్తున్నప్పటికి డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని కేవలం BSNL మాత్రమే అందిస్తున్నది. ఇతర ISP లు సంవత్సరానికి రూ.399 ధర గల డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వాన్ని అందిస్తాయి. సాధారణంగా డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ యొక్క ధర ఒక సంవత్సరానికి 1,499 రూపాయలు మరియు ఒక నెలకు రూ.299 ఖర్చు అవుతుంది.

రూ .449, రూ .599 మరియు రూ .799 వంటి సరసమైన ధరలో లభించే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క ప్లాన్లు డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం చందా ప్రయోజనాన్ని అందించవు. పరిశ్రమలో మరే ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) 799 రూపాయల కన్నా తక్కువ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో OTT చందాలను అందించడం లేదు కావున BSNL కూడా ఇదే తరహాను అవలంబిస్తున్నది. డేటా స్పీడ్ విషయానికొస్తే రూ.449 ప్లాన్ వినియోగదారులకు 30Mbps వద్ద ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది, తరువాత రూ .599 ప్లాన్ 60Mbps వేగంతో మరియు రూ.799 ధర వద్ద లభించే ప్లాన్ 100Mbps వేగంతో డేటాను బ్రౌజ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త సవరణలు
బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఈ నెల ప్రారంభంలో తన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లను సవరించింది. 300Mbps వేగంతో డేటాను బ్రౌజ్ చేయడానికి వినియోగదారులు రూ.2,000 కంటే ఎక్కువ ధర గల ప్లాన్ లను ఎంచుకోవలసి ఉంటుంది. మెరుగైన వేగంతో మరియు సరసమైన ధరల వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను నిరంతరం అందిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్ల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కొన్ని పెద్ద మార్పులను తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








