BSNL బంపర్ ఆఫర్, రోజుకు 2.2జీబి అదనపు డేటా పొందే అవకాశం
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి బంపర్ ఆఫర్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి బంపర్ ఆఫర్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ఆఫర్ క్రింద వీరు రోజుకు 2.2జీబి అదనపు 3జీ డేటాను పొందే వీలుంటుంది. ఈ ఫెస్టివ్ సీజర్ ఆఫర్‌ను సెప్టంబర్ 16 నుంచి పాన్ ఇండియా అంతటా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.

60 రోజుల పాటు అదనపు డేటా బెనిఫిట్స్..
రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకునే కొత్త ప్రీపెయిడ్ కస్టమర్స్‌కు ‘‘ఫెస్టివ్ తోఫా'' క్రింద 60 రోజుల పాటు ఈ అదనపు బెనిఫిట్స్‌తో కూడిన బంఫర్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ.448 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఈ అదనపు డేటా బెనిఫిట్ అందుబాటులో ఉంటుందని టెల్కో తెలిపింది.

పండుగలను పురస్కరించుకుని..
వినాయక చవతి, దేవీ నవరాత్రి, దుర్గా పూజా, దసరా, దీపావళి తదితర పండుగులను పురస్కరించుకుని అదనపు బెనిఫిట్స్‌తో కూడిన ఫెస్టివ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎమ్‌డి అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. క్రిందటి నెలలో ‘రక్షా బంధన్ ప్లాన్' పేరుతో ఓ సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 74 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్ ఖరీదు రూ.399. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్ ఇంకా డేటాతో పాటు రోజుకు 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ క్రింద రోజుకో పర్సనలైజిడ్ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది.

రిలయన్స్ గ్రూప్ అన్‌లిమిట్‌తో కీలక ఒప్పందం..
తాజా డెవలప్‌మెంట్స్‌లో భాగంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్స్‌కు చెందిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) కంపెనీ అన్‌లిమిట్‌తో బీఎస్ఎన్ఎల్ కీలక ఒప్పందం కుదర్చుకుంది. అన్‌లిమిట్ సంస్థను 2016లో లాంచ్ చేసారు. ఈ సంస్థ ఆఫర్ చేస్తోన్న ఐఓటీ ఆధారిత సేవలు ద్వారా ఇప్పటికే లక్ష డివైస్‌లకు చేరువైనట్లు సంస్థ చెబుతోంది. బీఎస్ఎన్ఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో తమ ఐఓటీ యూజర్ సంఖ్య మరింత పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుర్గెన్ హేస్ తెలిపారు. కనెక్టెడ్ వెహికల్స్, ఇండస్ట్రీ ఆటోమేషన్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేస్తోందని హేస్ పేర్కొన్నారు.

10 లక్షలు కొత్త కస్టమర్‌లే మా టార్గెట్..
రిలయన్స్ అన్‌లిమిట్‌తో కుదర్చుకున్న ఒప్పందం పై బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ (వాల్యూ యాడెడ్ సర్వీస్ విభాగం) డీకే అగర్వాల్ స్పందిస్తూ నాన్-ఎక్స్‌క్లూజివ్ బేసిస్ క్రింద తమ వెర్‌లైస్ నెట్‌వర్క్ క్యాపబిలిటీస్, అన్‌లిమిట్ సబ్‌స్ర్కైబర్స్‌కు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చే ఏడాది నాటికి 10 లక్షలు కొత్త కస్టమర్‌లను తాము టార్గెట్ చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








