BSNL - గూగుల్ నెస్ట్ మినీ, హబ్ ఆఫర్ల గురించి మీకు తెలియని విషయాలు

|

ఇండియాలో గల ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రస్తుత మరియు కొత్త బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం కొత్తగా Google Nest Mini మరియు Google Nest Hub ఆఫర్‌లను ప్రకటించింది. భారత్ ఫైబర్ ప్లాన్‌ల కొత్త క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఈ కొత్త ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు BSNL నుండి ఎంచుకున్న బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌ల కోసం వెళ్లే కస్టమర్‌లు సంబంధిత గ్యాడ్జెట్‌ల వాస్తవ ధరలో కొంత భాగాన్ని చెల్లించడం ద్వారా డిస్కౌంట్ ధర వద్ద Google Nest Mini మరియు Google Nest Hub లను తమ చేతులలో పొందడానికి అర్హులు అవుతారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL- Google Nest Mini ఆఫర్

BSNL- Google Nest Mini ఆఫర్

BSNL మరియు గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్లలో ముందుగా తెలుసుకోవలసిన విషయానికి వస్తే భారత్ ఫైబర్/ఎయిర్‌ఫైబర్ కొత్త వినియోగదారుల కోసం మరియు పాత భారత్ ఫైబర్/DSL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం ఈ ఆఫర్‌ కొద్దిగా భిన్నంగా ఉంటుందని గమనించండి. కొత్త భారత్ ఫైబర్/ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ల ఆఫర్ విషయానికి వస్తే కొత్త భారత్ ఫైబర్/ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లను రూ.1,287 ధర వద్ద (13 నెలలు x రూ.99) చెల్లించి 13 నెలల పాటు కొనుగోలు చేసిన వారికి గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్‌ను పొందవచ్చు. BSNL యొక్క FTTH, AirFibre మరియు DSL బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ నుండి కనీసం కొత్తవారు కనీసం రూ.799 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌ల కోసం వెళ్లే కస్టమర్‌లు ఈ ఆఫర్‌కు అర్హులు అవుతారు.

Google Nest Mini ఆఫర్

BSNL పాత వినియోగదారుల విషయానికి వస్తే Google Nest Mini ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతులు పాత ప్లాన్‌లకు కూడా కొత్త ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే స్వల్ప వ్యత్యాసం ఉంటాయి. పాత ప్లాన్‌ల కోసం వెళ్లే BSNL కస్టమర్‌లు 12 నెలల పాటు ఆఫర్ పొందుతారు మరియు వారు రూ .1,188 (12 నెలలు x రూ. 99) చెల్లించాలి. గూగుల్ నెస్ట్ మినీ యొక్క స్టాండలోన్ ధర రూ.4,999.

BSNL- Google Nest హబ్ ఆఫర్
 

BSNL- Google Nest హబ్ ఆఫర్

BSNL యొక్క Google Nest Hub ఆఫర్ పొందడానికి కొత్త లేదా పాత ప్లాన్‌ల కోసం వెళ్లే కస్టమర్‌లు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులలో కనీసం రూ.1,999 ఖర్చు చేయాలి. కాబట్టి దీనిని కొనుగోలు చేయగల కస్టమర్‌లు Google Nest హబ్‌ను BSNL నుండి నమ్మశక్యం కాని ధర వద్ద పొందవచ్చు. కొత్త భారత్ ఫైబర్/ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లతో గూగుల్ నెస్ట్ హబ్‌ను పొందడానికి వినియోగదారులు రూ.2587 (13 నెలలు x రూ .199) చెల్లించాలి. పాత ప్లాన్‌లతో ఉన్న వినియోగదారులు రూ.2,388 (12 నెలలు x రూ .199) చెల్లించాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

పాత మరియు కొత్త ప్లాన్‌ల కోసం దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు భిన్నంగా ఉంటాయి. మీరు వాటిని BSNL యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. ఈ ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఇది BSNL నుండి ప్రమోషనల్ ఆఫర్. కావున ఇది కేవలం 90 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 15, 2021 న ప్రారంభమవుతుంది మరియు జనవరి 12, 2022 న ముగుస్తుంది. ఈ ఆఫర్ అండమాన్ మరియు నికోబార్‌తో సహా అన్ని టెలికాం సర్కిళ్లకు వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Bundled Google Nest Mini, Nest Hub New Offers For Broadband Users: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X