Just In
- 11 min ago
Moto G30, G10 పవర్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!
- 2 hrs ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 3 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
Don't Miss
- Finance
OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అశ్విన్‌కే.. వరుసగా రెండు భారత్‌కే!
- News
వైజాగ్ స్టీల్‌పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్‌లో పడతారా ?
- Automobiles
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉచిత OTT సబ్స్క్రిప్షన్ యాడ్-ఆన్ ప్యాక్‌లతో ప్రైవేట్ టెల్కోలకు సవాల్ విసిరిన BSNL
ఇండియాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బిఎస్ఎన్ఎల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా మంచి విజయం సాధిస్తోంది. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కొనుగోలుపై ఇప్పుడు వినియోగదారులకు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది. చాలా సంవత్సరాలుగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నప్పటికి ఎయిర్టెల్ మరియు జియో యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో అందించే OTT ప్రయోజనాల కారణంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఇంటర్నెట్ వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది.

భారత్ ఫైబర్ యాడ్-ఆన్ ప్యాక్
బ్రాడ్‌బ్యాండ్ సేవల డిమాండ్ ను పెంచుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సమర్పణలను ప్రారంభించింది. అయితే BSNL ఫైబర్ సమర్పణలలో గల ఏకైక లోపం OTT ప్రయోజనాలు లేకపోవడం. అయితే ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో పాటు సరసమైన ధరలో లభించే యాడ్-ఆన్ ప్యాక్‌లలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్ వివరాలు
బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు రెండు వేర్వేరు ధరల వద్ద ఒకే ఒక OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను అందిస్తోంది. మొదటి మూడు నెలలు ఈ ప్యాక్ ను వినియోగదారులు నెలకు రూ.129 ధర వద్ద పొందుతారు. మొదటి మూడు నెలల తరువాత ఈ ప్లాన్ యొక్క ధర నెలకు రూ.199 కు పెరుగుతుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ వినియోగదారులకు వూట్ సెలెక్ట్, సోనీలైవ్ స్పెషల్, Zee5 ప్రీమియం, YuppTV టివి లైవ్, YuppTV FDFS, YuppTV మూవీస్, సపోర్ట్ మరియు మార్కెటింగ్ కంటెంట్ వంటి OTT యాప్ లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఛార్జీలలో సేవల పన్ను (GST) ఉండదని గమనించండి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్ లభ్యత
BSNL సంస్థ ఈ బ్రాడ్‌బ్యాండ్ OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను ప్రతి సర్కిల్లో అందించనుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ జనవరి 18, 2021 నుండి అమల్లోకి రానుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ కస్టమర్లు మరియు సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు జనవరి 18 నుండి ఈ OTT యాడ్-ఆన్ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ప్రీమియం లైబ్రరీ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు అందించే ప్రతి సబ్స్క్రిప్షన్ అనుమతించబడుతుందని గమనించాలి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్ vs ఎయిర్టెల్, జియో OTT యాడ్-ఆన్
వినియోగదారులు తమకు లభించే OTT లైబ్రరీ యొక్క సేవలను పరిగణలోకి తీసుకుంటే కనుక యాడ్-ఆన్ ప్యాక్ యొక్క నెలవారీ ధర చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో ఉచితంగా OTT ప్రయోజనాలను కూడా అందిస్తారని మర్చిపోకూడదు. ఎయిర్టెల్ మరియు జియో రెండూ తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అనేక OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190