టార్గెట్ Jio.. వ్యూహాత్మకంగా అడుగులువేస్తోన్న బీఎస్ఎన్ఎల్!

జియో 4జీ సేవలు మారుమూల పల్లెలకు సైతం అందుబాటులోకి వచ్చేసాయి. మొబైట్ 4జీ ఇంటర్నెట్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో తన 'Welcome offer'తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. డిసెంబర్ 31, 2016 వరకు అందుబాటులో ఉండే వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో అందిస్తోన్న అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Read More : ఆ లెనోవో ఫోన్‌కు jio సపోర్ట్ అందింది, పండగ చేస్కోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోకు పోటీగా...

జియోకు పోటీగా మిగిలిన టెలికామ్ ఆపరేటర్లు తమ డేటా ప్లాన్‌ల పై పోటాపోటీగా డిస్కౌంట్‌లను గుప్పిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ మాత్రం భిన్నమైన ఆలోచనలతో జియో‌కు చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తోంది.

వ్యూహాత్మకంగా..

ఇటీవల జరిగిన 2016 స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో భాగంగా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ టెలికం సంస్థలు భారీ మొత్తంలో స్పెక్ట్రమ్ ఎయిర్‌వేవ్స్‌ను కొనుగోలు చేయగా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఈ వేలంలో చాలా సైలెంట్‌గా కనిపించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ మౌనం వెనుక వ్యూహాత్మక ఆలోచనే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తిస్థాయిలో బలోపేతం..

అదనపు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేముందు, తనవద్ద ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్‌ను పూర్తిస్థాయిలోబలోపేతం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఇందుకుగాను భారీ పెట్టుబడులతో తమ నెట్ వర్క్ సామర్ధ్యాలను మెరుగుపరుచుకునే దిశలో ముందుకు సాగుతోంది.

 

రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని బిఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. ఇలా వ్యూహాత్మకంగా అడుగులువేస్తోన్న బీఎస్ఎన్ఎల్, రిలయన్స జియోకు ఏ విధంగా పోటీ కాబోతుందో ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త మొబైల్ టవర్స్‌

తన మొబైల్ నెట్‌వర్క్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రా, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లలో కొత్త మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్దమవుతోంది.

జీఎస్ఎమ్ విస్తరణ ప్రాజక్ట్...

జీఎస్ఎమ్ విస్తరణ ప్రాజక్ట్ క్రింద సర్వీస్ క్వాలిటీని మరింతగా మెరుగుపరుచుకునేందుకు 20,000 BTS (Base Transceiver Station)లను ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ నెలకొల్పనుంది. వీటిలో అత్యధిక శాతం టవర్స్ ఇప్పుటి నుంచి మార్చిలోగా ఇన్‌స్టాల్ చేయబడతాయి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

40,000 వై-ఫై హాట్‌స్పాట్‌లు

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా 2,700 వై-ఫై హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. మార్చి 2018 నాటికి ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల సంఖ్యను 40,000కు పెంచాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

Opex, Capex Model ఆధారంగా

బీఎస్ఎన్ఎల్ అందించనున్న ఓపెన్ వై-ఫై నెట్ వర్క్ Opex, Capex Model ఆధారంగా ఉంటుంది. Opex మోడల్ కు క్రిందకు వచ్చే వై-ఫై హాట్ స్పాట్ లను బీఎస్ఎన్ఎల్ 5 సంవత్సరాల పాటు రన్ చేస్తుంది. ఈ సమయంలో సంబంధింత వై-ఫై హాట్ స్పాట్‌కు చెందిన ఫ్రాంచైజ్ పార్టనర్స్ కూడా సేల్స్, మార్కెటింగ్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. Capex Model క్రిందకు వచ్చే వై-ఫై హాట్ స్పాట్‌లను పూర్తిగా మెయింటేన్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైఫై హాట్‌స్పాట్‌ కనెక్ట్‌ కావడం ద్వారా..

ఈ హాట్‌స్పాట్స్ అన్నింటిని తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. దీని వల్ల తమ కస్టమర్లు వాటి పరిధిలోకి వెళ్ళగానే డేటా సెషన్‌ వైఫై హాట్‌స్పాట్‌ కనెక్ట్‌ కావడం వల్ల నిరంతరాయంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటారు.

జియోను ఎదుర్కొనేందుకు..

ఇలా జియోను ఎదుర్కొనేందుకు బీఎస్ఎన్ఎల్ అన్ని రకాల చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Could Be a Serious Threat to Reliance Jio, Find Out How. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting