యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న BSNL యూజర్లకు మరో బంపరాఫర్‌ని ప్రకటించింది. రిలయన్స్ జియో,మరియు భారతీయ ఎయిర్టెల్ కు పోటీగా BSNL సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న BSNL యూజర్లకు మరో బంపరాఫర్‌ని ప్రకటించింది. రిలయన్స్ జియో,మరియు భారతీయ ఎయిర్టెల్ కు పోటీగా BSNL సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.ఈ ఆఫర్లో భాగంగా నెలకు రూ.99కే 45జిబి డేటా అందించబోతుంది. కాగా కొన్ని రోజుల క్రితం BSNL రూ.786కే మరో ప్లాన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే , ఒకవేళ మీరు ఇంకా ఆ ప్లాన్ ను పొందక పోతే జూన్ 26 లోపు ప్లాన్ ను పొందవచ్చు.

రిలయన్స్ జీయో రూ.1,999 ప్లాన్ కు పోటీగా :
రిలయన్స్ జీయో అందిస్తున్న రూ.1,999కు పోటీగా BSNL ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు జియో అందిస్తున్న ప్లాన్ ఏంటంటే రూ.1,999కే 125 జీబీ డేటాతో పాటు రోజుకో 100 sms లు మరియు అపరిమితమైన వాయిస్ కాల్స్ ,ఈ ఆఫర్ వాలిడిటీ 180 రోజులు మాత్రమే .

రోమింగ్ లో కూడా వర్తిస్తాయి :
ఈ BSNL ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో వినియోగదారులు దీర్ఘకాల ప్రయోజనాలను పొందుతారు .ఈ ప్లాన్ ద్వారా వినియోగదారుడు రోమింగ్ లో కూడా 2 జీబీ రోజు వారి డేటాతో పాటు , 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ఆఫర్ వాలిడిటీ 150 రోజులు మాత్రమే. మొత్తం వాలిడిటీ పీరియడ్ కు గాను,ప్రీపెయిడ్ యూజర్లు 300GB డేటా మరియు 15,000 SMS వరకు పొందుతారు.

Fifa స్పెషల్ ప్లాన్ రూ.149:
ఇదే కాకుండా, BSNL FIFA ప్రత్యేక ప్లాన్ ను రూ.149కే ప్రవేశపెట్టింది, ఈ ప్లాన్ లో భాగంగా 28 రోజులపాటు 4GB రోజు డేటాను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ లో వాయిస్ కాల్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు .

non-FTTH బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ :
కొన్ని రోజుల క్రితం, BSNL నాలుగు కొత్త non-FTTH బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ప్రారంభించింది,ఈ ప్లాన్స్ రూ .99 నుండి రూ 399 వరకు ప్రారంభమైంది . ఈ ప్లాన్ లో భాగంగా వినియోగదారులు 45GB నుండి 600GB వరకు డేటాను పొందవచ్చు.

BSNL అందిస్తున్న మరి కొన్ని ఆఫర్స్ :
BSNL నెలవారి ప్లాన్స్ చాలా ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్స్ లో భాగంగా వినియోగదారులు రూ .99 నెలకు 45జిబి డేటా, రూ.199తో నెలకు 150GB డేటా, రూ. 299తో నెలకు 300జిబి డేటా, రూ.300 తో నెలకు 600జిబి డేటాను పొందవచ్చు.

20Mbps స్పీడ్ తో:
ఈ కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లన్స్ మీకు 20Mbps స్పీడ్ ను అందిస్తుంది. డేటా వినియోగించిన తరువాత 1Mbps స్పీడ్ వస్తుంది.


Click it and Unblock the Notifications