రెండు టాప్ ప్లాన్లను తొలగించిన బిఎస్ఎన్ఎల్, కారణం ఇదే!

దిగ్గజ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రు .333, రూ .444 సహా అనేక ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్లను తొలగించింది. దేశంలో అనేక ప్రాంతాలలో 2017 సంవత్సరంలో ఈ ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఈ క

|

దిగ్గజ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రు .333, రూ .444 సహా అనేక ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్లను తొలగించింది. దేశంలో అనేక ప్రాంతాలలో 2017 సంవత్సరంలో ఈ ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇవే ప్లాన్స్ని తొలగించామని తెలిపింది. రూ .339, రూ .379, రూ .392 ప్లాన్లు కూడా తాలూగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

రెండు టాప్ ప్లాన్లను బిఎస్ఎన్ఎల్ లేపేసింది, కారణం ఇదే!

అయితే ఈ ప్లాన్లను ఎందుకు తొలగించాలో బీఎన్ఎన్ఎల్ వెల్లడించలేదు. త్వరలో ఆ విషయం మీద ఆ కంపెనీ స్పష్టత ఇవ్వే అవకాశం ఉంది ..!ఇదిలా ఉంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ నష్టాలను ఎదుర్కుంటోంది. క్లుప్లంగా చెప్పాలంటే..

2014-15

2014-15

బిఎస్ఎన్ఎల్ కు 2014-15 లో రూ .672 కోట్లు, 2015-16 లో రూ .3854 కోట్ల నిర్వహణ లాభాలు (ఆపరేటింగ్ ప్రాఫిట్స్) వచ్చాయి. 2014-15లో నికర నష్టం రూ 8234 కోట్లు కాగా, 2015-16 లో రూ .4859 కోట్లు, 2016-17 తగ్గి రూ .4793 కోట్లకు తగ్గింది.

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

ఈ నష్టాలకు తాము బాధ్యులం కాదని, కాబట్టి 1.1.2017 నుండి వేతన సవరణ జరగాల్సిందేనని, బిఎస్ఎన్ఎల్ ను నష్టాల నుండి కోలుకుని లాభాల బాట పట్టించేందుకు తాము చేసిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ 2019 ఫిబ్రవరి 18 నుండి 20 వరకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, అధికారులు సమైక్యంగా సమ్మె చేశారు.

బిఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా

బిఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా

ఈ విషయాలు ఇలా ఉంటే ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా పెరిగింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ మార్కెట్ వాటా 10,63 శాతానికి చేరుకుంది. నెట్వర్క్ విస్తరణ ఇందుకు దోహదపడిందని ఆ కంపెనీ డైరెక్టర్ షీట్ల ప్రసాద్ తెలిపారు. గత ఫిబ్రవరిలో రెండు టెలికాం కంపెనీలు మాత్రమే నూతన వినియోగదారులను సంపాదించుకున్నాయన్నారు. అందుకే బిఎస్ఎన్ఎల్ ఒక్కటేని అన్నారు.

22 టెలికాం సర్కిళ్లు

22 టెలికాం సర్కిళ్లు

దేశవ్యాప్తంగా 22 టెలికాం సర్కిళ్లు ఉండగా .. 20 సర్కిళ్లలో బిఎసఎన్ఎల్ సర్వీసులు అందిస్తోంది. 2018 మార్చి నాటికి ఈ కంపెనీ మార్కెట్ వాటా 10,22 శాతంగా ఉంది. 2016 మార్చిలో తన లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలో మార్కెట్ వాటా 9.05 శాతం ఉండగా .. దేశవ్యాప్త ప్రాతిపదికన 8.35 శాతంగా ఉంది.

54,000 టవర్లను

54,000 టవర్లను

2018-19 సంవత్సరంలో బిఎసఎన్ఎల్ 54,000 టవర్లను ఏర్పాటు చేసిందన్నారు. ఇంతకు ముందటి మూడేళ్లలో ఏర్పాటు చేసిన టవర్లకన్నా ఇవి ఎక్కువ కావడం విశేషం. 2018-19 సంవత్సరానికి 4 జి టవర్ల ఏర్పాటును ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు దాదాపు 5.340 వరకు 4 జీ టవర్లను ఏర్పాటు చేసినట్టు బిఎసఎన్ఎల్ తెలిపింది.

50 లక్షలకు పైగా కస్టమర్లు

50 లక్షలకు పైగా కస్టమర్లు

నెట్వర్క్ విస్తరణతోపాటు ఆకర్షణీయమైన ప్లాన్లను ఆఫర్ చేస్తున్నందు వల్ల ఇతర టెలికాం కంపెనీల నుంచి చాలా మంది మొబైల్ కస్టమర్లు బిఎసఎన్ఎల్కు మారుతున్నారని ప్రసాద్ తెలిపారు .. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్పి) ద్వారా 2018-19 సంవత్సరంలో 50 లక్షలకు పైగా కస్టమర్లు ఇతర ఆపరేటర్ల నుంచి బిఎసఎన్ఎల్కు మారినట్టు ప్రసాద్ తెలిపారు.

Best Mobiles in India

English summary
BSNL discontinues two popular prepaid mobile data plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X