BSNL దీపావళి బొనాంజా.. కేవలం రూ.1 కే అన్‌లిమిటెడ్ కాల్స్, 60GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఇటీవలే దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 4G నెట్‌వర్క్ కోసం కావాల్సిన టెక్నాలజీని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకుంది. ఇందుకోసం టాటా సంస్థతో జతకట్టింది. 4G నెట్‌వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేసింది. 4G నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు యూజర్లను ఆకట్టుకొనేందుకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తోంది.
ఆగస్టు నెలలో BSNL ఆజాదీ కా ప్లాన్ పేరుతో స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.1 కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS, ప్రతిరోజు 2GB డేటాను అందించింది. ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉండేది. అయితే కొత్త సిమ్ కార్డుల కొనుగోలుపై మాత్రమే ఈ ఆఫర్‌ను అందించింది.

ఈ ఆఫర్ ద్వారా BSNL భారీగా యూజర్లను ఆకట్టుకుంది. ఈ ప్లాన్‌ను ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుందని తొలుత ప్రకటన చేసినా.. ప్రజల నుంచి వచ్చిన స్పందన కారణంగా సెప్టెంబర్ 15 వ తేదీ వరకు ఆఫర్‌ను పొడిగించింది. ట్రాయ్ వివరాల ఆధారంగా ఆగస్టు నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ సుమారుగా 13.85 లక్షల కొత్త యూజర్లను సంపాదించుకుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా :
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను మరోసారి తీసుకొచ్చింది. దీపావళి సందర్భంగా తీసుకొచ్చినట్లు సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 'బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా' (BSNL Diwali Bonanza) పేరుతో తీసుకొచ్చిన ఆఫర్ ఇవాళ్టి (అక్టోబర్ 15) నుంచి నవంబర్ 15 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1 రీఛార్జ్ ప్లాన్ కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని BSNL తెలిపింది.
This Diwali, light up your life with BSNL Swadeshi connection!
— BSNL India (@BSNLCorporate) October 15, 2025
Celebrate with BSNL Diwali Bonanza @ just ₹1. Get unlimited calls, 2 GB data/day, 100 SMS/Day and a Free SIM.
Offer Valid from15 Oct to 15 Nov 2025 | For new users only#BSNL #BSNLDiwaliBonanza #DiwaliOffer… pic.twitter.com/genxLWRpE4
గతంలో మాదిరిగానే కేవలం కొత్త యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డును ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కావాల్సిన యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ రిటైలర్ లేదా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.
* ఆగస్టు నెలకు సంబంధించిన మొబైల్ యూజర్ల వివరాలను టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. ఈ వివరాల ఆధారంగా జియో, ఎయిర్‌టెల్‌తోపాటు BSNL భారీగా యూజర్లను సంపాదించుకుంది. మరో సంస్థ వోడాఫోన్ ఐడియా భారీ యూజర్లను కోల్పోయింది. వివిధ కారణాలతో ఇటీవల కాలంగా భారీగా యూజర్లను కోల్పోయిన BSNL.. ఆగస్టు నెలలో 13.85 లక్షల మంది యూజర్లు సంపాదించుకుంది.
జియో నెట్‌వర్క్‌లో కొత్తగా 19 లక్షల యూజర్లు చేరారు. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 4.96 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. వోడాఫోన్ ఐడియా ఆగస్టు నెలలో ఏకంగా సుమారు 3.08 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఈ వివరాల ఆధారంగా దేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 122.45 కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications








