బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ధమాకా ! ఇప్పుడు రోజు 2జిబి డేటా పొందండి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పండుగల సందర్బంగా తమ ప్రీపెయిడ్ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పండుగల సందర్బంగా తమ ప్రీపెయిడ్ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.78తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా 10 రోజుల పాటు ప్రతీ రోజు అపరిమిత కాల్స్, 100 ఎస్‌ఎంఎస్, 2జిబి డేటా అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. అక్టోబర్ 15 నుంచి బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త ప్యాక్ యొక్క ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో ఉంది

రూ.78 ప్రీపెయిడ్ ప్లాన్....
రూ.78 ప్రీపెయిడ్ ప్లాన్,బిఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ మరియు వీడియో కాల్స్ అందిస్తోంది.దీంతో పాటు ప్యాక్ లో రోజుకు 2 GB డేటాను అందిస్తుంది మరియు రోజువారీ పరిమితిని వినియోగించిన తర్వాత, వేగం 80 kbps కి తగ్గించబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 10 రోజులు చెల్లుతుంది.

రిలయన్స్ జియో....
పండుగ సందర్భంగా స్పెషల్ యాన్యువల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో . రూ.1699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ లైవ్‌లోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

ఎయిర్టెల్....
కొద్ది రోజుల క్రితం,టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ల ద్వారా దాని ప్రీపెయిడ్ పోర్ట్ ఫోలియోను పునరుద్ధరించడానికి, రూ. 159, రూ. 181 మరియు రూ. 289 ప్యాక్లను అందుబాటులో ఉంచింది.

రూ. 398 ప్రీపెయిడ్ ప్లాను ...
గత వారం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జి రూ. 398 ప్లాన్ ను అనుబాటులో తెచ్చింది,ఈ ప్యాక్ లో అపరిమిత కాల్స్ మరియు రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది,అలాగే ఇతర ప్రయోజనాల తో సహా, 70 రోజుల మొత్తం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది


Click it and Unblock the Notifications








